Standup Rahul Teaser:ప్రియాంకా చోప్రా అంటే ఈలలు.. చలపతిరావు అంటే గోలా?

ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ టైం అస్సలు బాలేదు. నిజానికి మొదటి మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కూడా రాబట్టాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి దాకా రాజ్ తరుణ్ కి అవకాశాలు వరుసగా వస్తున్నాయి కానీ ఏ సినిమా కూడా సరైన హిట్ కొట్టలేక పోతోంది. కొత్త హీరోల ఎంట్రీతో రాజ్ తరుణ్ కి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో మంచి సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు రాజ్ తరుణ్.

తాజాగా రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ 'స్టాండప్ రాహుల్', 'కూర్చుంది చాలు' అనేది సినిమా ట్యాగ్ లైన్‌. నంద కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా సాంటో మోహన్ వీరంకిని ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం చేస్తూ ఈ సినిమాని సహ నిర్మిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ సినిమా టీజర్ ను బాహుబలి స్టార్ దగ్గుబాటి రానా విడుదల చేశారు. ఈ టీజర్ లో రాజ్ తరుణ్ స్టాండప్ కమెడియన్ పాత్రలో నటిస్తున్నారు.

జీవితంలో ఏ విషయం కోసం ఖచ్చితంగా నిలబడని ఓ వ్యక్తి కథ కాగా అలాంటి వ్యక్తి ప్రేమలో పడితే ఆ అమ్మాయి కోసం, తన తల్లిదండ్రుల కోసం, తాను అభిమానించే స్టాండప్ కామెడీ కోసం ఏం చేశాడు అనే లెక్కలో ఈ సినిమాను రూపొందించారు. ఎదుటి వాళ్ళను నవ్వించడానికి రాజ్ తరుణ్ పడే కష్టం, నవ్వకుండా పెదాల బిగబెట్టుకునే వారి వల్ల తను ఫీల్ అయ్యే ఫ్రస్టేషన్ అన్నీ టీజర్ లో కనిపిస్తుంది.

 Rana Daggubati launches the teaser of Raj Tarun’s Stand Up Rahul

ఇక మగాళ్ళు పిల్లల కోసం అని ప్రియాంకా చోప్రా అంటే ఈలలు వేశారని, అదే చలపతిరావు అంటే గోల చేశారని చెబుతున్న కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, మురళి శర్మ, ఇంద్రజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి స్వీకర్ అగస్తి సంగీతం అందించగా విడుదలకు సంబంధించిన క్లారిటీ మాత్రం ఇవ్వలేదు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X