Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దగ్గుబాటి అభిమానులకు సర్‌ప్రైజ్.. రానా పుట్టినరోజు కానుక ఇదే
నేడు (డిసెంబర్ 14) దగ్గుబాటి వారసుడు రానా పుట్టినరోజు. 1984 సంవత్సరం సరిగ్గా ఇదే రోజు జన్మించిన రానా నేటితో 35 ఏళ్ళు పూర్తిచేసుకొని 36వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్బంగా దగ్గుబాటి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది 'విరాటపర్వం' చిత్రయూనిట్.
దగ్గుబాటి రానా ప్రస్తుతం 'విరాటపర్వం' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి నటిస్తోంది. కొన్నిరోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. అయితే ఈ రోజు రానా బర్త్ డే సందర్బంగా 'విరాటపర్వం' ఫస్ట్‌లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ మేరకు రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

'విరాటపర్వం' చిత్రానికి బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబుతో పాటు సుధాకర్ చెరుకూరి సంయుక్త నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఇంటెన్సివ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ నటి నందితా దాస్ కీలక పాత్రలో నటిస్తోంది.
చిత్రంలో నక్సలైట్ ఉద్యమంలో చేరే జానపద కళాకారిణి పాత్రను సాయి పల్లవి పోషిస్తోందని తెలిసింది. అదేవిధంగా రానా పోషిస్తున్న పాత్ర ఆయన కెరీర్ లోనే చేప్పుకోదగినదై ఉంటుందని టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.