ఎన్టీఆర్‌ సినిమాను రిజెక్ట్ చేసిన రష్మిక: అసలు కారణం అదేనంటూ ప్రచారం

'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన చేసి చాలా రోజులు గడుస్తున్నా.. మరో అప్‌డేట్ ఇవ్వలేదు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఇందులో పలానా హీరోయిన్ నటిస్తుందని, పలానా హీరో నటిస్తున్నాడని, బాలీవుడ్ హీరోయిన్ చేస్తుందని ఇలా.. దీని గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

అడల్ట్ వెబ్ సిరీస్ 'గంధీబాత్' ఫేం అన్వేషీ జైన్ హాట్ ఫొటోలు

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా నటించబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఆమెను నిజంగానే సంప్రదించిందట. అయితే, ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించిందని తెలిసింది. పలు ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపడం వల్ల డేట్స్ సర్ధుబాటు చేయలేని కారణంగా రష్మిక ఈ నిర్ణయం తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో మరో హీరోయిన్‌ను అన్వేషిస్తున్నారట దర్శక నిర్మాతలు. ఈ జాబితాలో జాన్వీ కపూర్ పేరు ఎక్కువగా ప్రచారం అవుతోంది.

 Rashmika Mandanna Reject Jr NTR - Trivikram Movie

ఇదిలా ఉండగా, క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పెడుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అలాగే, ఇటీవల దీనికి 'రాజా వచ్చినాడు' అనే పేరును కూడా అనుకుంటున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అలాగే, ఈ మూవీలో కమెడియన్ సునీల్ విలన్‌గా నటిస్తున్నాడని అంటున్నారు. అలాగే, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రను పోషిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X