Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
RT69: షడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రవితేజ.. అవి రిలీజ్ కాకముందే మూడో సినిమా ప్రీలుక్
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసే హీరోల్లో మాస్ మహారాజ రవితేజ ఒకడు. బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కష్టాల తర్వాత స్టార్ హీరోగా మారాడతను. ఆ మధ్య వరుస పెట్టి హిట్లు కొట్టిన ఈ సీనియర్ హీరో.. చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్' అనే సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇది సూపర్ హిట్ టాక్‌తో పాటు రవితేజ కెరీర్‌లోనే అత్యంత ఎక్కువ కలెక్షన్లను కూడా వసూలు చేసి సత్తా చాటింది.
హాట్ హాట్‌గా రెచ్చిపోయిన మంచు లక్ష్మి: తొలిసారి అందాలన్నీ కనిపించేలా ఘాటు ఫోజులు
'క్రాక్' ఇచ్చిన సక్సెస్‌తో మాంచి ఊపు మీదున్న రవితేజ.. ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమా స్టార్ట్ చేశాడు. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు.. ఫస్ట్ గ్లిమ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఇది ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్యం కాలేదు.

'ఖిలాడీ' మూవీకి అడ్డంకులు రావడంతో రవితేజ.. శరత్ మందవా అనే దర్శకుడితో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే చిత్రాన్ని మొదలెట్టాడు. ఇది కూడా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇందులో ఈ మాస్ హీరో క్లాస్ రోల్‌ను చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ఓ హింట్ కూడా ఇచ్చేసింది. ఇక, ఈ మూవీ షూటింగ్‌ను కొద్ది రోజుల పాటు ఆపేసి.. మళ్లీ 'ఖిలాడీ'ని పున: ప్రారంభించాడు. ఈ రెండు చిత్రాలు కొద్ది రోజుల్లోనే టాకీ పార్ట్‌ను కంప్లీట్ చేసుకుంటాయి. అంటే రవితేజ పూర్తిగా ఖాళీ అయిపోతాడు. ఈ నేపథ్యంలో ఈ మాస్ హీరో తన తదుపరి సినిమాను కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది.
మాస్ మహారాజ రవితేజ.. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కినతో ఓ సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సదరు డైరెక్టర్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. రవితేజ 69వ చిత్రంగా ఇది రూపొందబోతుంది. ఈ సినిమాను అక్టోబర్ 4 నుంచి ప్రారంభించబోతున్నట్లు యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో రవితేజ డార్క్ బ్యాగ్రౌండ్‌లో స్టైలిష్ ఫోజుతో కనిపిస్తున్నాడు. దీంతో అప్పుడే ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడిపోయాయి.
షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక, ఇందులో నటించే నటీనటుల వివరాలు చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. త్వరలోనే మరిన్ని విషయాలను రివీల్ చేయబోతున్నారు. ఇక, ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన రవితేజ 'యాక్షన్ మొదలు' అని ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో ఇది కూడా అతడి స్టైల్‌లోనే ఉండే ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అప్పుడే అందరూ అంచనా వేసేసుకుంటున్నారు.