రవితేజ న్యూ మూవీ ప్రారంభం, ఇద్దరు భామలతో.. (ఫోటోస్)
మాస్ మహారాజా రవితేజ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయింది. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'డిస్కోరాజా' అనే టైటిల్ ఖరారు చేశారు. మహా శివరాత్రి సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంలో ప్రారంభోత్సవం జరిపారు.
నిర్మాతలు రజని తాళ్ళూరి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, రామ్ తాళ్ళూరి కెమెరా స్విచాన్ చేశారు. 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, 'నన్ను దోచుకుందువటే' ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

‘నేల టికెట్’ నిర్మాతలతో మరోసారి
రవితేజ హీరోగా ఇంతకు ముందు వచ్చిన ‘నేల టిక్కెట్' బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఆ మూవీ నిర్మించి ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు మరో సినిమా చేసి పెడుతున్నారు మాస్ మహారాజా. మార్చి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

నిర్మాత రామ్ తాళ్ళూరి
నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. నేల టికెట్ తర్వాత రవితేజతో మరో మూవీ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. పాయల్ రాజపుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నాడు. దర్శకుడు విఐ ఆనంద్ చెప్పిన కథ అద్భుతంగా ఉంది. మా బ్యానర్ విలువను రెట్టింపు చేసే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నామని తెలిపారు.

హిట్టు కోసం రవితేజ వెయిటింగ్
రవితేజకు ఈ మధ్య కాలంలో ఒక్క హిట్టు పడలేదు. గతేడాది వచ్చిన ‘టచ్ చేసి చూడు', ‘నేల టిక్కెట్', ‘అమర్ అక్బర్ ఆంటోనీ' బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో హిట్ట కోసం రవితేజ, ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

నటీనటులు
రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : రామ్ తళ్లూరి
దర్శకుడు : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫర్ : సాయి శ్రీరామ్
డైలాగ్స్ : అబ్బూరి రవి
మ్యూజిక్ : థమన్
ఎడిటర్ : నవీన్ నూలి


Click it and Unblock the Notifications











