For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Saakini Daakini Twitter Review: రెజీనా, నివేదా మూవీకి ఊహించని టాక్.. అది కూడా వర్కౌట్ అయితే మాత్రం!

  |

  ఈ మధ్య కాలంలో తెలుగులో విభిన్నమైన కాన్సెప్టులతో సినిమాలు వస్తున్నాయి. వాటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో దర్శక నిర్మాతలు, స్టార్లు అలాంటి ప్రయోగాలు చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు వచ్చిన చిత్రమే 'శాకినీ డాకినీ'. లేడీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమాలో గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్లు నివేదా థామస్, రెజీనా కసాండ్ర నటించారు. పూర్తి స్థాయిలో ఫన్ అండ్ థ్రిల్లర్ మూవీగా రూపొందిన దీనిపై ఆరంభం నుంచే అంచనాలు మంచిగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీ కాంబోలో వచ్చిన 'శాకినీ డాకినీ' మూవీ ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

  శాకినీ డాకినీ కలిసి వచ్చేశారుగా

  శాకినీ డాకినీ కలిసి వచ్చేశారుగా

  టాలీవుడ్ ముద్దుగుమ్మలు నివేదా థామస్, రెజీనా కసాండ్ర కలిసి నటించిన చిత్రమే 'శాకినీ డాకినీ'. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సునీత నిర్మించారు. ఈ సినిమా 'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాను మిక్కీ మెక్లియరీ సంగీతాన్ని అందించాడు.

  బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన శ్రీయ: ఆ పార్టులన్నీ చూపిస్తూ దారుణంగా!

  అలాంటి స్టోరీతో వచ్చిన మూవీ

  అలాంటి స్టోరీతో వచ్చిన మూవీ

  టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నివేదా థామస్, రెజీనా కసాండ్ర కలిసి 'శాకినీ డాకినీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫన్ అండ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీ.. పోలీస్ ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు అమ్మాయిల కథతో రూపొందింది. వీళ్లిద్దరూ కలిసి ఓ అమ్మాయి కిడ్నాప్‌ను ఎలా ఛేదించారు అన్న పాయింట్‌తో ఇది తెరకెక్కింది.

  అంచనాలు తగ్గట్లుగా బిజినెస్

  అంచనాలు తగ్గట్లుగా బిజినెస్

  విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'శాకినీ డాకినీ' సినిమా ప్రమోషన్ సరికొత్తగా సాగింది. అందుకే దీని నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. అంతేకాదు, ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ కూడా చేస్తున్నారు.

  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్విట్టర్ రివ్యూ: సుధీర్ మూవీకి అలాంటి టాక్.. అదే పెద్ద మైనస్ అంటూ!

  శాకినీ డాకినీ మూవీకి టాక్ ఇలా

  శాకినీ డాకినీ మూవీకి టాక్ ఇలా

  రెజీనా కసాండ్ర, నివేదా థామస్ కలిసి నటించిన 'శాకినీ డాకినీ' మూవీ కిడ్నాప్, దాని వెనుక ఉన్న మాఫియాను మట్టుపెట్టే కథతో రూపొందింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్లా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. చాలా మంది ఈ మూవీ ఏవరేజ్ అంటూ ట్విట్టర్ ద్వారా తెలుపుతున్నారు.

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

  క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'శాకినీ డాకినీ' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం చేయడం.. ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడం.. హీరోయిన్లు ఓ కిడ్నాప్ కేసులో భాగం అవడం అనే పాయింట్లతో సాగుతుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం రొటీన్ సన్నివేశాలతో సోసోగా నడుస్తుందని వీక్షకులు చెబుతున్నారు. క్లైమాక్స్ కూడా ఆకట్టుకోని విధంగానే ఉంటుందట.

  డెలివరీ తర్వాత తొలిసారి బికినీలో ప్రణిత: మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

  సినిమాలో ప్లస్‌లు.. మైనస్‌ ఇలా

  సినిమాలో ప్లస్‌లు.. మైనస్‌ ఇలా

  లేడీ మల్టీస్టారర్‌గా వచ్చిన 'శాకినీ డాకినీ' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. సినిమా నేపథ్యం, కామెడీ ఇంటర్వెల్ ట్విస్ట్, ఫస్టాఫ్, బ్యాగ్రౌండ్ స్కోర్, రెజీనా, నివేదా నటన ఈ చిత్రానికి ప్లస్‌ అని తెలిసింది. అయితే, సెకెండాఫ్ తేలిపోవడం, క్లైమాక్స్ రొటీన్‌గా ఉండడం, ఎగ్జైట్‌మెంట్ మిస్ అవడం ఈ చిత్రానికి మైనస్‌గా మారిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

  ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే

  ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే


  ట్విట్టర్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. 'శాకినీ డాకినీ' మూవీ ఫన్ అండ్ కొంత ఎగ్జైట్‌మెంట్‌తో కూడిన థ్రిల్లర్ అని తెలిసింది. కొరియన్ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా రీమేక్ చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడట. అయితే, ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకెండాఫ్ తేలిపోవడం నిరాశను కలిగిస్తుందట. మొత్తానికి ఈ సినిమా పర్వాలేదనిపించేలా ఉంటుందని టాక్.

  శృతి మించిన నందినీ హాట్ షో: టాప్ అందాలను ఆరబోస్తూ రచ్చ

  అది కూడా వర్కౌట్ అయ్యుంటే

  అది కూడా వర్కౌట్ అయ్యుంటే

  క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'శాకినీ డాకినీ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఫస్టాఫ్ అంతా చాలా కొత్త సన్నివేశాలతో సాగుతుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఇది కూడా వర్కౌట్ అయ్యుంటే సినిమా వేరే లెవెల్‌లో ఉండేదన్న టాక్ వినిపిస్తోంది.

  English summary
  Regina Cassandra and Nivetha Thomas Did Saakini Daakini Movie Under Sudheer Varma Direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X