twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నపూర్ణ స్టూడియోస్‌లో పదేళ్లు గడిపా.. చిరంజీవి సమక్షంలో రేఖ కామెంట్స్

    |

    నటసామ్రాట్, దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరుతో ఏర్పాటు చేయబడిన ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్‌ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన సినీ తారలు హాజరై సందడి చేశారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో శ్రీదేవి, రేఖలకు ఈ అవార్డ్స్ దక్కాయి. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేయడం జరిగింది. బోనీ కపూర్ సహా సినీ ప్రముఖులంతా ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    గతేడాది ANR అవార్డ్స్ ప్రకటించినందున ఈ ఏడాదే గత సంవత్సర అవార్డును కలుపుకుని, ఈ సంవత్సర అవార్డులు సైతం ప్రకటించారు. 2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవికి, 2019 సంవత్సరానికి గాను ప్రముఖ నటి రేఖ ఈ అవార్డు సొంతం చేసుకుంది. మెగాస్టార్‌ చిరంజీవి ఈ అవార్డులను శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్, నటి రేఖలకు అందజేశారు.

    Rekha speech at ANR Awards 2019

    ఈ సందర్బంగా రేఖ మాట్లాడుతూ.. ''నేను ఈ అన్నపూర్ణ స్టూడియోస్‌లో దాదాపు 10 సంవత్సరాలు గడిపాను. మళ్ళీ ఇక్కడికి రావడం సంతోషంగా అనిపిస్తోంది. అప్పట్లో నాగేశ్వరరావుగారు నాకు ఇండస్ట్రీ గురించి, నటన గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. అవి నా కెరీర్‌కి ఎంతో ఉపయోగపడ్డాయి. చాలా కాలం తర్వాత మా అమ్మగారి చివరి కోరిక కోసం ఒక తెలుగు సినిమా చేశాను. త్వరలోనే తెలుగు స్పష్టంగా, శ్రీదేవిగారి లాగా నేర్చుకొని తెలుగులో సినిమా చేస్తాను'' అన్నారు.

    English summary
    In Hyderabad Annaurna Studios ANR Awards 2019 programe done very much grandly. In this event Chiranjeevi came chief guest
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X