నన్ను ఆపకు, నా నెత్తుటిని ఉబకనివ్వు.. వివస్త్రగా..! రేణు దేశాయ్ సెన్సేషనల్ పోస్ట్
Recommended Video
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ టాలెంట్ గురించి అందరికీ తెలుసు. గ్లామర్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న ఈమె.. రెగ్యులర్‌గా తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా తన విశేషాలను, తన కుటుంబం, కొడుకు అకీరా నందన్ విశేషాలు తెలుపుతూ పోస్టులు పెడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూద్దామా..

రేణు దేశాయ్ హీరోయిన్ మాత్రమే కాదు..
పవన్ కళ్యాణ్ భార్య అని చెప్పడం కంటే ముందు రేణు దేశాయ్ ఓ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే పవన్ భార్యగా తన పాపులారిటీ మరింత పెంచుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల కొద్దికాలానికే పవన్‌తో విడిపోయింది కూడా. అయితే ఈమె లోని మరో కోణం రచయిత్రి. పలు రచనలు, కవితలు రాయడం ఈమెకు హాబీ.

తనదైన భావజాలంతో
ఇంగ్లిష్‌లో ఎన్నో కవితలు రాసింది. సరదాగా, చైతన్య పరిచేలా తనదైన స్టైల్ భావజాలంతో కవితలు రాస్తుంటుంది రేణు. ఈ కోవలోనే తాజాగా వరణుడిపై రాసిన ఓ కవితను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రేణుదేశాయ్. కాకపోతే అది ఇంగ్లీష్ భాషలో ఉంది. కాబట్టి ఈ కవితను తెలుగులోకి కూడా అనువాదం చేయించి నెటిజన్ల ముందుకు తీసుకొచ్చింది రేణు.

రేణు దేశాయ్.. యమ టాలెంట్
ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్‌తో తన కవితను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేయించిన రేణు.. ఈ రెండు భాషల్లో కవితను నెటిజన్ల ముందు పెట్టింది. దీంతో రేణు కవిత్వం చూసి ఫిదా అవుతూ కామెంట్స్ పెడుతున్నారు ఆమె ఫ్యాన్స్. చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి రేణు దేశాయ్.. అని తెగ పొగిడేస్తున్నారు.
రేణు దేశాయ్ రాసిన ఆ కవిత మీకోసం..
‘‘నా ఆత్మ సంచరిస్తోంది ఈ పెనుగాలుల్లో వివస్త్రగా, విపాదరక్షగా
తన ఉనికిని చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంటోంది
నన్ను నా రక్తంలో పరిమితం చేయకు,
నా ప్రాణ వాహినిలా నాకు స్వేచ్ఛగా ప్రవహించాలనుంది
తెరలు తెరలుగా వచ్చి బలంగా తాకే వెచ్చటి గాలుల్లో ఈకలా
అలా అలా తేలిపోతుంది ఇప్పుడు నా హృదయం,
మెరుపు జాడని వెతుక్కుంటూ వెళ్లే జల్లెడ లాంటి మేఘంలా ఉంది
నన్ను ఆపకు - నా నెత్తుటిని ఉబకనివ్వు
నేను పరవళ్లు తొక్కాలి - నేను పైపైకెగరాలి
నేను కదలాలి - నేను కురవాలి
విత్తనమై నేలమ్మ కడుపులో మళ్లీ మొలకెత్తాలి
మళ్లీ వికసించడానికి - మళ్లీ విహరించడానికి'' అంటూ తన కలానికి పదును పెట్టింది రేణు.

రెండో పెళ్లిపై రేణు క్లారిటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్దమైన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా రేణు దేశాయ్ రెండో పెళ్లిపై ఓ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయి. పవన్ భార్యగా పిలిపించుకోవడం తనకు ఇష్టం లేదని, తాను రెండో పెళ్లికి సిద్దమయ్యానని రేణు స్వయంగా ప్రకటించింది. తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నానని, అందుకు సంబందించిన పనులు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చేసింది రేణు.


Click it and Unblock the Notifications











