twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూసైడ్ చేసుకుంటానంటూ రేణు దేశాయ్‌కి మెసేజ్‌లు.. మరో దారి లేదు, అలా చేస్తానని వార్నింగ్!

    |

    ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఎవరు ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. సినిమా రంగం కూడా ఇప్పటికే దాదాపు మూతపడి పోయిన పరిస్థితి, ఎక్కడా షూటింగులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు సినిమా హీరోలు, నిర్మాణ సంస్థలు మరికొందరు నటీమణులు సైతం కరోనా మందులు అలాగే ఆక్సిజన్ బెడ్స్ కు సంబంధించిన రిక్వెస్ట్ లు ఫార్వర్డ్ చేస్తూ తమ వంతు సాయం చేస్తున్నారు. ఇక అదే క్రమంలో పవన్ మాజీ భార్య, ప్రస్తుతం పలు టెలివిజన్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న రేణుదేశాయ్ కూడా తన వంతుగా సహాయం అందిస్తున్నారు.

    ఆమె తనకు చేతనయినంత సాయం చేస్తూ వెళ్తుంటే ఆమెకు పదే పదే కొందరరి నుంచి తప్పుడు మెసేజ్ లు వెళ్తున్నాయి. తాజాగా ఆమె దీనికి సంబంధించి తన సోషల్ మీడియా వేదిక ఒక మెసేజ్ షేర్ చేశారు.. తాను నేరుగా డబ్బులు ఇవ్వలేను అని ఆమె సదరు సందేశంలో పేర్కొన్నారు.. మీరు నిజంగా ఇబ్బందుల్లో ఉంటే నేను మీకు ఆహారం లేదా కొన్ని మందులు అందించే అవకాశం ఉందని ఆమె పేర్కొంది.

    Renu Desai slams netizens for threatening messages for not helping

    అలాగే కొందరు ఫండ్ రైజర్ లింక్స్ షేర్ చేస్తున్నారని కానీ వాటిని వెరిఫై చేసేందుకు తన దగ్గర ఎలాంటి టీం లేదు కాబట్టి తాను ఆ విషయాల్లో కూడా ఏమీ చేయలేని అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి ఎమర్జెన్సీలో ఉన్న కరోనా పేషెంట్స్ కి మాత్రమే తాను సేవ చేస్తున్నాను అని ఆమె పేర్కొంది.. కొందరు మీరు డబ్బులు ఇచ్చి సహాయం చేయకపోతే సూసైడ్ చేసుకుని చనిపోతానని బెదిరిస్తున్నారని ఇక మీదట అలాంటి మెసేజ్ గాని వస్తే వాటిని పోలీస్ అధికారులతో షేర్ చేస్తా అని ఆమె హెచ్చరించారు. మీరు సరైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వగలిగితే నేను ఆహారం అలాగే నిత్యావసర వస్తువులు అందించడానికి ప్రయత్నిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

    English summary
    Renu Desai is currently helping the needy on social media during the COVID-19 crisis. but she has given a clarity that ''please don’t send me “I will commit suicide if you don’t help with money” msgs, I will have to share those msgs with the police authorities,I can help with food or groceries if you give your proper contact details!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X