For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RGV : 40 ఏళ్ళ ముందు కలిస్తే వదిలేవాడిని కాదు, విడాకులూ అయ్యేవి కావు.. గే అనుకుంటారు, కానీ నమ్మరు!

  |

  వర్మ ఎంటర్ అయితే వార్ వన్ సైడే అన్నట్లుంది నేటి పరిస్థితి. ఎందుకంటే పరిస్థితి ఏదైనా, సన్నివేశం ఏదైనా వర్మ దిగనంతవరకే వర్మ దిగితే అంతే సంగుతులు అటెన్షన్ అంతా ఆయన వైపు తిరిగి పోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం మీద ఎక్కువ ఫోకస్ చేయని రామ్ గోపాల్ వర్మ ఇతరుల సినిమా ప్రమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు అనిపిస్తోంది.

  అరియానా, అషు రెడ్డి లాంటి వాళ్ల కోసం యూట్యూబ్ ఛానల్స్ ని ప్రమోట్ చేస్తూనే మరో పక్క చిన్న సినిమాలను కూడా ప్రోత్సహించే పనిలో పడ్డారు. అలా ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళిన వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...

  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో

  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో

  మేఘ ఆకాష్ హీరోయిన్ గా అదిత్ అరుణ్ హీరోగా రూపొందిన డియర్ మేఘ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన దియా అనే సినిమాని తెలుగులో డియర్ మేఘ పేరుతో రీమేక్ చేస్తున్నారు.. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యం నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 3వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిపారు దర్శకనిర్మాతలు. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  డైవోర్స్ కూడా తీసుకునేవాడిని కాదు

  డైవోర్స్ కూడా తీసుకునేవాడిని కాదు

  ఈ ఈవెంట్ లో వర్మ ముందుగా ఒక పాట పాడిన సింగర్ ను మెచ్చుకున్నారు. ఈ పాట వింటున్నప్పుడు తనకు చాలా మంచి ఫీలింగ్ కలిగిందని ఆయన అన్నారు. ఇక ఆ తరువాత మేఘా ఆకాశ్ వంక చూస్తూ 40 ఏళ్ల క్రితం కనుక తనకు ఇలాంటి అమ్మాయి దొరికి ఉంటే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు అని వర్మ చెప్పుకొచ్చాడు. ఇలాంటి అమ్మాయి గారికి తనకు దొరికి ఉంటే కచ్చితంగా డ్రైవర్స్ కూడా తీసుకుని ఉండేవాడిని కాదు అని అన్నాడు.

  డయాబెటిస్ వచ్చేస్తుంది

  డయాబెటిస్ వచ్చేస్తుంది

  అలా అంటూనే మేఘతో తనకు ఒక ప్రాబ్లం ఉందని తను నా టైప్ హీరోయిన్ కాదని చెబుతూనే ఆమె చాలా స్వీట్ గా ఉంటుందని ఆమెను కలిసిన వారిలో డయాబెటిస్ వస్తుందేమోనని ఆమె మీద పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక అక్కడితో ఆగి పోనీ వర్మ హీరో అదిత్ ను కూడా పొగిడాడు. అలాగే ఇప్పుడు మేఘని పొగిడినట్లుగా అదిత్ ని పొగిడితే తనను గే అనుకుంటారని కూడా వర్మ చెప్పుకొచ్చాడు.

  గే అనుకుంటారు కానీ

  గే అనుకుంటారు కానీ

  అయితే తన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా నమ్ముతారు ఏమో కానీ తాను మాత్రం గే అంటే జనం నమ్మరు అని వర్మ చెప్పుకొచ్చాడు.. అంతేకాక అదిత్ లో మంచి నటుడు ఉన్నాడు అని చెప్పిన వర్మ తనతో అదిత్ ఒక సినిమా త్వరలో చేయబోతున్నాడని కూడా ప్రకటించారు. మొత్తం మీద డియర్ మేఘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్మ చేసిన ఈ కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

  ఉబ్బితబ్బిబయిన మేఘా ఆకాష్

  ఉబ్బితబ్బిబయిన మేఘా ఆకాష్

  అయితే వర్మ ఏకంగా పెళ్లి చేసుకుంటాను అనేట్టు కామెంట్ చేయడంతో మేఘా ఆకాశ్ అయితే ఉబ్బితబ్బిబ్బైయ్యారు. అయితే మేఘ ఆకాష్ కెరీర్ అంతా బాగున్నట్లు గా ఏమీ లేదు. ఎందుకంటే ఆమె ఎన్ని సినిమాలు చేస్తున్నా సరే ఆమెకు స్టార్ హోదా అయితే దక్కడం లేదు అనే చెప్పాలి. చూడాలి మరి ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెడుతుందేమో మరి.

  English summary
  Ram Gopal Varma attended the pre-release event of ‘Dear Megha’. he made flirtatious talk with megha akash.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X