twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్జీవీ కనిపించని పురుగు.. చిరంజీవి పాటకు పోటీగా.. కరోనాపై స్పెషల్ ఫోకస్

    |

    రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు తెలియన వారెవరూ ఉండరు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వర్మ నిత్యం ఏదో టాపిక్ మీద రాయి వేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం కరోనా వైరస్ అంశం హాట్ టాపిక్‌గా ఉండటంతో.. దాన్ని కూడా తన చిత్ర విచిత్రమైన ట్వీట్లతో బెదరగొట్టేస్తున్నాడు. తాజాగా కరోనాపై ఓ పాటను రచించినట్టు రేపు ఆ పాటను రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించాడు.

    అంతా కరోనా మయం..

    అంతా కరోనా మయం..

    ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్‌కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తోంది. అయితే ఈ వైరస్ పట్ల అవగాహన కలిగించేందుకు సినీ తారలంతా ముందుకు వస్తున్నారు. తాజాగా చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారు కోటి స్వరపరిచిన పాట ద్వారా కరోనాపై అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు.

    ఆ పాటపై వర్మ సెటైర్లు..

    ఆ పాటపై వర్మ సెటైర్లు..

    అయితే చిరంజీవి చేసే ఏ పనినైనా విమర్శించిడం, సెటైరికల్‌గా స్పందించడం వర్మకు అలవాటే. అదే క్రమంలో కరోనా పాటపైనా స్పందించాడు. మెగా ఎమోషనల్ మల్టీ స్టారర్ సాంగ్.. బాక్టీరియా ప్రపంచంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కరోనా వైరస్‌కూ ఈ పాట నచ్చిందంటా. ఏప్రిల్ ఫూల్ డేన నేను కూడా ఓ పాటను రిలీజ్ చేస్తానని చెప్పి.. ఎవరో ఫూలో ఆ వైరస్‌నే డిసైడ్ అవ్వమనంటూ ట్వీట్ చేశాడు.

    చిరుకు పోటిగానే..

    చిరుకు పోటిగానే..

    చిరంజీవి పాటకు పోటీగా రిలీజ్ చేస్తున్న ఈ పాటను రేపు రానుంది. కరోనా వైరస్ పైన నేనే రాసి,పాడిన "కనిపించని పురుగు" అనే పాటని రేపు బయట పడేయబోతున్నాను...చేతులు కడుక్కొని వినండి. అంటూ ట్వీట్ చేశాడు.

    కరోనా వచ్చి చాలా నేర్పింది..

    కరోనా వచ్చి చాలా నేర్పింది..


    చదువురాని కరోనా వచ్చి మనకు చాలా కొత్త పదాలను నేర్పిందని చెప్పుకొచ్చాడు. సామాజిక దూరం, ఐసోలేషన్, స్వీయ నిర్భందం అంటూ కొత్త కొత్త పదాలను తెలియజేసిందని ట్వీట్ చేశాడు. ఇలా కరోనాను కూడా వదిలిపెట్టడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    RGV Special Song On Corona Virus. Ram Gopal Varma Wants To Release Kanipinchani Purugu On Corona Cirus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X