RRRలో అజయ్ దేవగన్ రోల్ లీక్.. జక్కన్న దాచినా బుడ్డోడు బయట పెట్టేశాడు!

తన సినిమాల విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. రిలీజ్ అయ్యే వరకు తన సినిమాలకు సంబంధించిన ఎలాంటి వార్తలు రాకుండా ఉండేలాగా ఆయన ప్లాన్ చేస్తుంటారు. ఆయన ఎంత కేర్ తీసుకుంటారో లీకు రాయుళ్ళు కూడా ఆయన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని లీక్ చేయడానికి అంతే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే పలుమార్లు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలు, ఫైట్ సీన్స్ వీడియోలు బయటకు రాగా ఇప్పుడు ఏకంగా ఒక బడా న్యూస్ లీక్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే

Recommended Video

RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu
సూపర్ క్రేజ్

సూపర్ క్రేజ్

బాహుబలి సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి కాస్త గ్యాప్ తీసుకుని తెలుగులో రెండు బడా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలతో మల్టీస్టారర్ సినిమా సెట్ చేశాడు. మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ అలాగే నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్ ఇద్దరితో కలిపి ఆయన ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

జక్కన్న క్లారిటీ

జక్కన్న క్లారిటీ

అయితే ఈ సినిమా ప్రారంభమైనప్పటినుంచి అనేక పుకార్లు, ప్రచారాలు జరగగా చివరికి రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరితో కలిసి కూర్చుని ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అనేక విషయాలు క్లారిటీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు కొమురం భీం ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం అని ఆయన వెల్లడించారు.

 ప్రచారాలకు నో బ్రేక్

ప్రచారాలకు నో బ్రేక్

ఆయన అంత క్లారిటీగా చెప్పిన సరే ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య ఒక ఫైట్ సీన్ ఉంటుందని ఒక జూనియర్ ఆర్టిస్ట్ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ వార్త వైరల్ కావడంతో రెండో రోజు రాజమౌళి టీం రంగంలోకి దిగి మరి ఆ ఛానల్ వీడియో లేపించేశారు. అంతగా లీకేజీల గురించి శ్రద్ధ తీసుకునే జక్కన్న టీంకు ఇప్పుడు పెద్ద వార్త లీక్ కావడం టెన్షన్ పెడుతోంది.

బుడ్డోడు లీక్ చేశాడు

బుడ్డోడు లీక్ చేశాడు

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు అనే వార్తే. అయితే ఈ విషయాన్ని లీక్ చేసింది లీకు రాయుడు కాదు ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తున్న ఒక బుడ్డోడు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు చక్రి. గతంలో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్ తండ్రిగా అజయ్ దేవగన్

ఎన్టీఆర్ తండ్రిగా అజయ్ దేవగన్

అదలా ఉంచితే ఈ మధ్య కాలంలో అజయ్ దేవగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విష్ చేస్తూ సినిమాలో ఆయన తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ చక్రి పేర్కొనడంతో ఇప్పుడు ఎన్టీఆర్ తండ్రిగా అజయ్ దేవగన్ కనిపించబోతున్నాడు అనే వార్త పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలియదు కానీ ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది.. మరి రాజమౌళి టీం రంగంలోకి దిగి ఈ ప్రచారాన్ని కూడా అడ్డుకట్ట వేస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X