twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR అవార్డుల ప్రభంజనం.. లండన్‌ క్రిటిక్స్‌ అవార్డుకు ఎంపిక!

    |

    దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మల్టీ స్టారర్ చిత్రం RRR. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధించింది. థియేట్రికల్ రిలీజ్‌తో బాక్సాఫీస్‌ను అదరగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రభంజనం సృష్టిస్తున్నది. ఇక ఆస్కార్ బరిలో నిలిచిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో క్రిటిక్స్ అవార్డులకు నామినేట్ అవ్వడం మరో విశేషంగా మారింది. తాజాగా లండన్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల నామినేట్ అవ్వడం తెలుగు, భారతీయ సినీ అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నది.ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

    ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులకుు

    ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులకుు


    RRR చిత్రం ఇటీవల ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల్లో మూడు కేటగిరిల్లో విజేతగా నిలిచింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ స్కోర్/సౌండ్ ట్రాక్ అవార్డులను గెలుచుకొన్నది. దాంతో ఈ సినిమాకు మరింత గౌరవం దక్కింది.

    హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్

    హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్

    ఇక RRR చిత్రం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులకు నామినేట్ అయింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు కోసం నామినేట్ చేశారు. ఈ క్యాటగిరీలో ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్, అర్జెంటీనా, 1985, క్లోజ్, డిసిషన్ టూ లీవ్‌తో పాటు RRR కూడా నామినేట్ అయింది.

    గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డులకు RRR నామినేట్

    గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డులకు RRR నామినేట్


    ఇదే కాకుండా అంతర్జాతీయంగా ప్రఖ్యాత గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డులకు RRR నామినేట్ అయింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీల్లో ఈ సినిమా నామినేషన్లను సంపాదించింది. ఇంకా ఈ అవార్డుల వేడుక జరుగాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ క్రిటిక్ అసోసియేషన్లు ఇచ్చే అవార్డుల విషయంలో జైత్రయాత్రను కొనసాగిస్తున్నది.

     లండన్ క్రిటిక్ సర్కిల్ అవార్డుల

    లండన్ క్రిటిక్ సర్కిల్ అవార్డుల

    ఇక లండన్ క్రిటిక్ సర్కిల్ అవార్డుల విషయానికి వస్తే.. RRR చిత్రం మరోసారి ఫేవరేట్‌గా నిలిచే అవకాశం కనిపిస్తున్నది. ఈ అవార్డుల క్యాటగిరీల్లో బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, టెక్నికల్ అచీవ్‌మెంట్ అవార్డు (స్టంట్స్) క్యాటగిరీల్లో నామినే్ అయింది.

    టాప్ 50 సినిమాల గ్లోబల్ లిస్టులో

    టాప్ 50 సినిమాల గ్లోబల్ లిస్టులో

    ఇదిలా ఉండగా, RRR చిత్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. సైట్ అండ్ సౌండ్ అనే మ్యాగజైన్ రూపొందించిన 2022లో టాప్ 50 సినిమాల గ్లోబల్ లిస్టులో RRR చిత్రం చోటు సంపాదించింది. RRR చిత్రం ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచింది.

    English summary
    DVV Entertainment tweeted that Elated to share that #RRR is soaring high in the sky. RRRmovie bagged 2 nominations at the LondonCritics’ Circle Awards for Best Foreign-Language Film of the Year and Technical Achievement Award (stunts)
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X