RRR Memes: సినిమా చూడాలంటే రెండు గాజులు కాదు.. ఆస్తులు కూడా అమ్మాల్సిందే.. గిలిగింతలు పెడుతున్న మీమ్స్ చూశారా?
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేసిన రాజమౌళి ఇప్పుడు RRR అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా విడుదలవుతున్న క్రమంలో అందరూ RRR గురించే మాట్లాడుతున్నారు. ఈ సినిమా గురించి మాత్రమే కాదు... సినిమా టికెట్ రేట్స్ గురించి కూడా చాలా మంది పెద్ద ఎత్తున ఛార్షితున్నారు. అంత రేటు ఏంటి? అని కొందరు ప్రశ్నిస్తుంటే... మరికొంత మంది ఈ సినిమా చూడాలి అంటే ఆస్తులు అమ్మాలసిందే అన్నట్టు ఫన్నీగా స్పందించారు. RRR సినిమాపై వచ్చిన మీమ్స్ గురించి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక టికెట్ రేట్స్ మీద వచ్చిన మీమ్స్ మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి.

పెద్ద ఎత్తున ప్రమోషన్స్
ఇప్పుడు దేశమంతా RRR సినిమా గురించి చర్చిస్తుంది.యావత్ సినీ అభిమానులందరూ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న RRR సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో ఇప్పటికే RRR టీమ్ కూడా వరుస ఇంటర్వ్యూలతో, భారత దేశం టూర్ తో సినిమాకు భారీ హైప్ కూడా తీసుకొచ్చారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు రాజమౌళి ఈ సినిమా కోసం గత వారం రోజుల నుంచి గ్యాప్ లేకుండా దేశమంతా తిరుగుతూ ప్రచారం చేశారు.

దేశమంతా చుట్టేసి
ప్రతి ఈవెంట్‌లోనూ ఏదో ఒక ఆసక్తికర విషయాలను తెలియజేస్తూ...ఆర్‌ఆర్‌ఆర్‌పై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ మల్టీస్టారర్ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు బాహుబలి చిత్రానికి పనిచేసిన టీం 'ఆర్ ఆర్ ఆర్' కోసం పని చేసింది.

బాహుబలి టీమ్
బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా మారిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాకు పెట్టిన భారీ బడ్జెట్, నెలకొన్న భారీ హైప్ దృష్ట్యా కొన్ని RRR టీమ్ ప్రభుత్వాలను సంప్రదించి మినహాయింపులు తెచ్చుకున్నారు.

భారీ ఎత్తున రేట్లు
భారీ బడ్జెట్ సినిమా కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాయి. అయితే ఆ పెరిగిన రేట్లను చూస్తే మాత్రం ఖంగు తినాల్సిందే. టికెట్ బుక్ చేద్దామని ప్రయత్నిస్తే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్కరి పరిస్థితే ఇలా ఉంటే ఇక ఫ్యామిలీ అంతటికి టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటూ రకరకాల మీమ్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ మీమ్స్ మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

టికెట్ రేట్ల విషయానికి వస్తే
రెండు తెలుగు రాష్ట్రాల్లో RRR టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ముందుగా తెలంగాణ విషయాన్ని వస్తే మొదటి మూడు రోజుల్లో సింగిల్ స్క్రీన్‌లో రూ. 236, మల్టీప్లెక్సుల్లో రూ. 413 నిర్ణయించారు. నాలుగో రోజు నుంచి సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ రేట్లు రూ. 212, మల్టీప్లెక్స్‌లో రూ. 354 ఉండబోతోతున్నాయి. ఏపీలో మొదటి పది రోజులు టికెట్ రేట్లు కనిష్టంగా రూ. 106 గరిష్టంగా రూ. 380 నిర్ణయించారు. ఈ సినిమా చూడాలి అంటే ఆస్తులు అమ్మాల్సిందే అని అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతే కాదు తమ క్రియేటివిటీ అంతా రంగరించి మీమ్స్ రూపంలో తీసుకు వచ్చారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.




Click it and Unblock the Notifications











