మిస్టర్ కూల్ బాలయ్య... అబ్బే అదంతా ఒట్టిదేనట!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాలో నటిస్తున్నారు. నిజానికి ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా రెండో దశ ప్రారంభం కావడంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోయింది. ఇక ఇదిలా ఉంటే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తర్వాత చేయబోయే సినిమాను కూడా ప్రకటించారు.. ఇటీవల క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ 107వ సినిమా ప్రకటించారు.

అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కూడా బాలకృష్ణ గోపీచంద్ మలినేని చెప్పిన కథ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు సూచించారని, చెప్పిన కథ ఆయనకు నచ్చలేదు అని ప్రచారం జరిగింది. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో అలాగే క్లైమాక్స్ విషయంలో కూడా బాలకృష్ణ సంతృప్తికరంగా లేరని ప్రచారం సారాంశం. అయితే బాలకృష్ణ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అలాంటి విషయాలు ఏమీ జరగలేదట.

rumours about Nandamuri Balakrishna gopichand malineni movie is fake says source

నిజానికి బాలకృష్ణ, గోపీచంద్ ఈ కథ చెప్పిన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని, ఆయన చెప్పిన కదా బాలకృష్ణకి బాగా నచ్చిందని అంటున్నారు. గోపీచంద్ విషయంలో బాలకృష్ణ గారు చాలా పాజిటివ్ గా ఉన్నారని ఒక నటుడిగా ఆయన దర్శకుడిని పూర్తిగా నమ్ముతారని అలాగే వారికి ఫ్రీడం ఇస్తారని బాలయ్య సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తలు పూర్తిగా అసంబద్ధం అని ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకు వస్తున్నాయనేది తెలియదని వారు చెప్పుకొచ్చారు.

ఇక స్క్రిప్ట్ బాగా కుదిరిందని గోపీచంద్ మలినేని కూడా ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని వారు చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతానికి ఈ సినిమాకు ఎలాంటి పేరు ఫిక్స్ చేయకపోవడంతో ఎన్.బి.కె107 అనే పేరుతో సంభోదిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా బాలకృష్ణ అఖండ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X