వార్ 2 దెబ్బకు నాగవంశీ దివాళా.. ఇల్లు అమ్ముకొని దుబాయ్‌కి.. వాస్తవమెంత?

సినిమా పరిశ్రమలో ఒక్క రాత్రిలోనే జీవితాలు తారుమారువుతాయి. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమాను తెరకెక్కిస్తే.. హిట్ అయిందా? లాభాల పంట పండినట్టే.. ఫ్లాప్ అయిందా? నిర్మాత పరిస్థితి గురించి వివరంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది ప్రొడ్యూసర్లు రోడ్డు మీదకు వచ్చిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి. అయితే తాజాగా టాలీవుడ్‌లో యాక్టివ్ ప్రొడ్యూసర్‌గా పేరున్న నాగవంశీపై వార్ 2 సినిమా రిలీజ్ తర్వాత అనేక రూమర్లు వస్తున్నాయి. ఆ రూమర్ల వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా పరిశ్రమలో చురుకైన నిర్ణయాలు తీసుకోవడంలోను, అలాగే కంటెంట్‌ను అసెస్‌మెంట్ చేయడంలోను, ప్రేక్షకుల నాడి పట్టే నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీ ఒకరంటే ఎలాంటి సందేహం లేదు. ఆడియెన్స్ పల్స్ పట్టి సినిమాలు తీసి ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడంలో తనదైన శైలిలో ముందుంటాడు. జెర్సీ, మ్యాడ్, మ్యాడ్ 2, లక్కీ భాస్కర్, సార్ లాంటి సినిమాలను అందించి ప్రశంసలు పొందారు.

Gossips on Producer Naga Vamsi

అయితే తాజాగా బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ రూపొందించిన వార్ 2 సినిమా విషయంలో తన స్ట్రాటజీకి వ్యతిరేకంగా వెళ్లాడనే ఆరోపణలు వినిపించాయి. అందుకు కారణం తాను అమితంగా అభిమానించే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడం.. ఆ మూవీపై భారీగా అంచనాలు ఉండటంతో ఫ్యాన్సీ రేటుకు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకొన్నాడు. దాదాపు 90 కోట్ల రూపాయలకు ఈ హక్కులను కొన్నాడు. జీఎస్టీతో కలిపి మొత్తం 105 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా తనదైన శైలిలో నిర్వహించి హైప్ పెంచారు.

అయితే వార్ 2 సినిమా రిలీజ్ తర్వాత పూర్తిగా నెగిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్లపై భారీ ప్రభావం పడింది. రెండో రోజు నుంచి క్రమంగా క్షీణించడం మొదలుపెట్టాయి. ఈ సినిమా ఓవరాల్ థియేట్రికల్ రన్‌లో సుమారుగా 50 కోట్ల నష్టం వాటిల్లుతుందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. అయితే కింగ్డమ్‌తోపాటు ఇటీవల ఆయన తీసిన సినిమాలు నష్టాలను చవిచూశాయి. దాంతో ఆయన దివాళా తీశాడనే విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి.

అయితే ఎన్టీఆర్‌ను వ్యతిరేకించే వర్గం, సినిమాను ట్రోల్ చేసే నెటిజన్లు నాగవంశీపై దాడిని ధాటిగా మొదలుపెట్టారు. రకరకాల పోస్టులతో దారుణంగా ట్రోల్ చేశారు. వార్ 2 సినిమాతో నాగవంశీ ఆర్థికంగా బాగా చితికిపోయాడు. చివరకు తన విల్లాను అమ్మేసి దుబాయ్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయేన దివాళా తీశారు అనే కామెంట్స్.. సానుభూతి వీడియోలు ట్విట్టర్, ఇతర సామాజిక మాథ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అ క్రమంలో నాగవంశీ గురించి ఫిల్మీబీట్ ఆరా తీయగా.. యువ నిర్మాత పరిస్థితి మరీ అంత అధ్వానంగా లేదు. ఆయన తీసిన సినిమాలు ఇటీవల భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. కింగ్డమ్‌లో పెద్దగా నష్టం వాటిల్లలేదు. అయితే వార్ 2 సినిమాతో భారీగా నష్టం వాటిల్లే పరిస్థితి ఉన్నా.. అతడిని ఆర్థికంగా దిగజార్చేంతగా పరిస్థితి లేదు. ఎన్టీఆర్‌ను ద్వేషించే వారు ఇలా సోషల్ మీడియాలో చెడుగా ప్రచారం చేస్తున్నారు అని ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఆయన మరో మంచి సినిమాతో భారీ లాభాలను సాధించేందుకు స్కెచ్ వేస్తున్నారని చెప్పారు.

More from Filmibeat

Read more about: naga vamsi jr ntr war 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X