twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ravi Teja's ROD మూవీపై రూమర్లు.. రిలీజ్ వాయిదా వెనుక అదే కారణం అంటూ..

    |

    టాలీవుడ్‌లో స్వయంకృషితో ఎదిగి మాస్ మహారాజ్‌గా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొన్న రవితేజకు హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో అలరిస్తున్నాడు. ఏడాదికి కనీసం మూడు, నాలుగు చిత్రాలతో తన రేంజ్‌లో ప్రేక్షకులకు వినోదం పంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల ఖిలాడి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడటం తెలిసిందే. ప్రస్తుతం Ramarao On Duty (Rod) చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఈ సినిమా వాస్తవానికి జూన్ 17వ తేదీన విడుదల కావాల్సింది. అయితే ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ ప్రకటన చేసింది.

    రవితేజ Rod మూవీ విడుదల వాయిదాపై ప్రకటన విడుదల చేస్తూ.. బిగ్‌ స్క్రీన్‌పై మాస్ అవుట్‌పుట్ ఇవ్వాలని అనుకొంటున్నాం. వెండితెరపైన గొప్ప అనుభూతిని ఇవ్వాలని అనుకొంటున్నాం. ఎక్స్‌ట్రా ఎఫర్ట్‌, కేర్‌తోపోస్టు ప్రొడక్షన్ చేస్తున్నాం. అందుచేత #RamaraoOnduty మూవీ విడుదల నిలిపివేస్తున్నాం. జూన్ 17న రిలీజ్ చేయడం లేదు. తర్వాత రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం అని ఓ ప్రకటనలో తెలిపారు.

     Rumours on Ravi Tejas Rama Rao On Duty movie

    అయితే టాలీవుడ్ మీడియాలో రవితేజ సినిమాపై భారీగా రూమర్లు ప్రచారం జరుగుతున్నాయి. రవితేజకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్‌లో కొంత మొత్తం నిర్మాతలు ఇవ్వలేదని, అందుకే మాస్ మహారాజ్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కు దూరంగా ఉన్నారు. అందుకే ఈ సినిమా ఆలస్యమైంది. దాంతో రిలీజ్‌ను వాయిదా వేశారు అనే విషయం ప్రచారంలో ఉంది. అయితే ఈ వార్త వెనుక అసలు విషయం ఏమిటో అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

    ఇదిలా ఉండగా, ఖిలాడీ సినిమా విషయంలో కూడా రవితేజ రెమ్యునరేషన్ వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద దుమారం చెలరేగింది. ఖిలాడీ దర్శకుడికి, రవితేజకు విభేదాలు నెలకొనడం, ప్రీ రిలీజ్ వేడుకలో మాస్ మహారాజ్ స్వయంగా దర్శకుడిపై వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే.

    English summary
    The release of Rama Rao On Duty is postponed and would not be releasing on June 17th due to extensive post production for the BEST and MASSIEST output!. A New Release Date will be announced soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X