‘సీత’లో పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్, సూపర్ హాట్ లుక్!
RX 100 చిత్రంలో తన అందం, నటనతో సెన్సేషన్ క్రియేట్ చేసి కుర్రకారును ఫిదా చేసిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ సినిమా తర్వాత పాయల్ మరోసారి తన గ్లామర్‌తో వెండితెరను హీటెక్కించడానికి రాబోతోంది. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న 'సీత'లో స్పెషల్ సాంగులో కనిపించబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పాయల్ లుక్ రిలీజ్ చేశారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా 'సీత' చిత్రం తెరకెక్కుతోంది. కథ సాగే క్రమంలో వచ్చే ఓ సిచ్యువేషన్లో 'బుల్ రెడ్డి... అనే పాటలో పాయల్ కనిపించబోతోంది. ఈ సాంగ్ ఏప్రిల్ 3న ఉదయం 10.30 గంటలకు చిత్ర బృందం విడుదల చేయబోతోంది.

స్పెషల్ సాంగులో పాయల్ రాజ్ పుత్ హాట్ అండ్ సెక్సీ గ్లామర్, ఆమె చేసే డాన్స్ 'సీత' సినిమా మొత్తానికే హైలెట్ అయ్యేలా ఉంటుందట. ఈ చిత్రంలో సోనూ సూద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కాబోతోంది.
నటీనటులు
బెల్లంకొండ శ్రీనివాస్
కాజల్ అగర్వాల్
మన్నారా చోప్రా
సోనూ సూద్
తనికెళ్ల భరణి
అభినవ్ గోమటం
అభిమన్యుసింగ్ తదితరులు

సాంకేతిక నిపుణులు
దర్శకత్వం: తేజ
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్
సమర్పణ: ఏ టీవీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రపీ: శిర్షా రే
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్: కనల్ కణ్ణన్
డైలాగ్స్: లక్ష్మీ భూపాల్


Click it and Unblock the Notifications











