For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR30: ఎన్టీఆర్ మూవీ నుంచి అదిరే అప్‌డేట్.. రంగంలోకి దిగిన ఇద్దరు స్టార్లు

  |

  ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. హీరోగా పరిచయమైన కొత్తలోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతోన్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌తో కనిపిస్తోన్న తారక్.. కొద్ది రోజుల క్రితమే RRR (రౌద్రం రణం రుధిరం) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకోవడంతో పాటు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులను లైన్‌లోకి తీసుకు వస్తున్నాడు.

  బోల్డు షోలో హద్దు దాటిన అనన్య నాగళ్ల: కుర్రాళ్లకు ఇది కదా అసలైన విందు

  జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. దీంతో ఈ సినిమాపై అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టారు. కానీ, ఆ తర్వాత కూడా ఈ సినిమా ప్రారంభంపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఇది మరింత ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఢీలా పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

  Sabu Cyril and Rathnavelu Working for NTR Movie

  చిత్ర యూనిట్ ద్వారా అందిన సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కే సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను వేగవంతం చేశారట. అంతేకాదు, ఈ మూవీ కోసం టాప్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఫేమస్ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ పని చేస్తున్నారని తెలిసింది. వీళ్లంతా కలిసి ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న పట్టుదలతో కష్టపడుతున్నారట. ఇక, ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను కంప్లీట్ చేసిన వెంటనే.. అంటే మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీని పట్టాలెక్కించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

  Bigg Boss Telugu 6: బాత్రూంలోనే ఆ కంటెస్టెంట్.. రిక్వెస్ట్ చేసినా వదలకుండా.. షాకిచ్చిన నాగార్జున

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

  English summary
  Tollywood Star Hero Jr NTR will do a film Under Koratala Shiva Direction. Now Sabu Cyril and Rathnavelu Working for This Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X