twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనాను తరిమికొడుదాం.. ప్రధాని 7 సూత్రాలకు సాయికుమార్ అండ..

    |

    దేశాన్ని కరోనావైరస్ కంబంధ హస్తాల నుంచి బయటపడేసేందుకు పోరాటం చేస్తున్న ప్రధాని మోదీకి తెలుగు సినీ పరిశ్రమ బేషరతుగా అండగా నిలుస్తున్నది. తాజాగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ మంగళవారం ప్రధాని నిర్ణయం తీసుకొన్నారు. ఈ క్రమంలో ఆయన కరోనాను తరిమి కొట్టడానికి ఆయన కొన్ని సూత్రాలను ప్రజలకు సందేశం ఇచ్చారు. అవేమిటంటే..

    దేశంలో కరోనా ప్రభావం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. కరోనాపై విజయం సాధించడానికి సప్త సూత్రాలు పేరిట ఆయన 7 సూత్రాలను ప్రజలకు వివరించారు. వాటిని కచ్చితంగా అమలు చేసినట్లయితే తప్పకుండా కరోనాపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో సినీ న‌టుడు, బిజేపీ నేత సాయికుమార్ కూడా త‌న స్టైల్లో కొవిడ్ -19 ఎలా ఎదుర్కోవాల‌ని ఓ వీడియో ద్వారా సూచించారు.

    Sai Kumar supports PM Modis 7 principles amid coronavirus fight

    మ‌న ప్రియ‌త‌మ ప్ర‌ధాని మోదీగారి స‌ప్త‌సూత్రాలు
    1) వృద్ధుల‌ను జాగ్ర‌త్త‌గా చూస్కోండి.
    2) మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను కొన‌సాగిస్తూ మాస్క్‌లు ధ‌రించి సామాజిక దూరం పాటించండి.
    3) రోగ నిరోధ‌కశ‌క్తిని పెంచుకోండి.
    4) పేద‌ల‌కు వీలైనంత సాయం చేయండి.
    5) ఆరోగ్యసేతు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
    6) తోటి ఉద్యోగుల‌కు..మీ మీద ఆధార‌ప‌డ్డ‌వారికి ఆస‌రాగా నిల‌బ‌డండి.
    7) కోవిడ్-19 మీద పోరాడుతున్న ప్ర‌తీ ఒక్క‌రిని గౌర‌వించండి. వారికి స‌హ‌క‌రించండి. ఇది మ‌న క‌ర్త‌వ్యం మ‌న బాధ్య‌త‌.

    అలాగే ఇంటి పట్టునే ఉండండి.. సురక్షితంగా ఉండాలి. దేశ ప్ర‌జ‌లైన మ‌నం వీట‌న్నింటిని పాటిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేద్దాం. క‌రోనాని త‌ర‌మి కొడ‌దాం.జైహింద్ అని ప్రధాని అన్నారు. ఈ విషయాలపై ప్రజలు స్పందించాలని సాయి కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

    English summary
    Actor Sai Kumar supports PM Modi's 7 principles amid coronavirus fight. He says, everyone should follow and support PM Modi's vision.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X