Just In
- 44 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, ఒడిశా, గోవా
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లుంగీ ఎత్తిన నాగ చైతన్య.. పుట్టినరోజు కావాలనే ఫొటో వదిలి.. వైరల్ చేసిన సాయి పల్లవి
రౌడి బేబి సాయి పల్లవి సినిమాలో ఎంత అల్లరిగా ఉంటుందో బయట కూడా తన సన్నిహితులతో అలాగే ఉంటుంది. సినిమా కథకు తగ్గట్టుగా తనని తాను కొత్తగా ప్రజెంట్ చేసుకునే అమ్మడు ఎమోషన్, మాస్ పాత్రలతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటోంది. గ్లామర్ తో పెద్దగా అవసరం లేకండానే అమ్మడు తన నటనతో కుర్రాళ్ళ మనసులను గట్టిగానే గిల్లేస్తోంది. ఇక నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఒక స్పెషల్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రెడిషినల్ లుక్స్ లోనే..
సోషల్ మీడియాలో సాయి పల్లవికి ఫాలోవర్స్ ఏ రేంజ్ లో ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చాలా సింపుల్ గా ఒక పక్కింటి అమ్మాయిలా ఉండే ఈ కేరళ భామ ఎక్కువగా ట్రెడిషినల్ లుక్స్ లో దర్శనమిస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు తనకు సన్నిహితంగా ఉండే స్టార్స్ ఫొటోలను మాత్రమే షేర్ చేస్తుంది. నెక్స్ట్ అమ్మడు లవ్ స్టొరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

లవ్ స్టొరీపై భారీ అంచనాలు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా తరువాత సాయి పల్లవి లవ్ స్టొరీ అనే సినిమా చేస్తోంది అన్నప్పటి నుంచి అంచనాలు ఒక్కసారిగా అకాశాన్ని అందుకుంటున్నాయి. లాక్ డౌన్ లేకపోయి ఉంటే సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఇక థియేటర్స్ మెల్లగా ఓపెన్ అవుతున్నప్పటికి ఇంకా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు.

లుంగీలో నాగచైతన్య లుక్
అసలు మ్యాటర్ లోకి వస్తే నేడు నాగ చైతన్య పుట్టినరోజు కావడంతో సెలబ్రెటీలు అభిమానులు భారీ స్థాయిలో పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో సాయి పల్లవి సినిమాకు సంబంధించిన పోస్టర్ ద్వారా హీరో గారికి విషెస్ అందించారు. అందులో నాగ చైతన్య లుంగీ లేపి పైకి కట్టుకుంటున్నట్లు ఉంది.

కావాలనే అల్లరిగా.. బర్త్ డే విషెస్
హ్యాపీ బర్త్ డే చైతన్య అంటూ ట్వీట్ చేసిన సాయి పల్లవి నవ్వుతున్న ఎమోజీని కూడా యాడ్ చేసింది. దీంతో అమ్మడు కావాలనే అల్లరిగా చైతన్యకు బర్త్ డే విషెస్ అందించినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఆ పోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక మొదటిసారి నాగ చైతన్యతో కలిసి రొమాన్స్ చేసిన సాయి పల్లవి లవ్ స్టొరీ సినిమాలో కూడా తన డిఫరెంట్ నటనతో ఆకట్టుకొనున్నట్లు తెలుస్తోంది.