Just In
Don't Miss!
- News
భారత్ లో యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల కలకలం ... 114కు పెరిగిన కేసులు
- Sports
పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీనే అత్యుత్తమం.. జడేజా కూడా: శ్రీలంక పేసర్
- Finance
4 వారాల్లో అతిపెద్ద పతనం, ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త జాగ్రత్త!
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
HIT హిందీ రీమేక్ మొదలు.. రాజ్‌కుమార్ రావ్‌తో శైలేష్ కొలను పిక్ వైరల్
మన తెలుగు కథలు వరుసబెట్టి బాలీవుడ్‌కు వెళ్తోన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి, జెర్సీ, హిట్ వంటి సినిమా కథలన్నీ కూడా బాలీవుడ్‌కు పయనమయ్యాయి. ఇందులో అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్‌గా రీమేక్ అవ్వడం అందరికీ తెలిసిందే. కబీర్ సింగ్ బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాదాపు మూడు వందల కోట్లు కొల్లగొట్టడంతో మన తెలుగు కథలకు గిరాకీ పెరిగింది. ఈక్రమంలోనే మరి కొన్ని కథలు అక్కడికి వెళ్లాయి.
జెర్సీ సినిమా కూడా హిందీలో రీమేక్ అయింది. షాహిద్ కపూర్ హీరోగా హిందీలో జెర్సీ షూటింగ్ కూడా పూర్తయింది. ఇక చిన్న సినిమాగా విడుదలైన HIT మూవీ తెలుగులో భారీ హిట్ అయింది. విశ్వక్‌సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. అందుకే ఈ మూవీని బాలీవుడ్‌లో రాజ్ కుమార్ రావును హీరోగా పెట్టి శైలేష్ కొలను డైరెక్ట్ చేసేందుకు సిద్దమయ్యాడు.

లాక్డౌన్ సమయంలో శైలేష్ కొలను హిట్ సినిమా రీమేక్ గురించి అధికారికంగా ప్రకటించాడు. తాజాగా రాజ్ కుమర్ రావును శైలేష్ కొలను కలిశాడు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ శైలేష్ కొలను ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోందని తెలిపాడు. మొత్తానికి ఒక్క సినిమాతోనే బాలీవుడ్ ఆఫర్‌ను చేజెక్కించుకున్నాడు. ఇక ఈ మూవీ తరువాత హిట్ సీక్వెల్‌ను తెలుగులో తెరకెక్కించే అవకాశం ఉంది.