For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha-Chaitanya : అంతా అయిపోయింది.. విడిపోతున్నామని అధికారిక ప్రకటన.. ఒకే సమయంలో ఒకేలా ఏమన్నారంటే?

  |

  టాలీవుడ్ లో నాగచైతన్య సమంతాలు విడాకుల బాటలో ఉన్నట్లు కొన్నాళ్ల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా వారి మధ్య సఖ్యత లేదని విడాకులు కూడా తీసుకోబోతున్నారు అనే ప్రచారాల నేపథ్యంలో ఆ వాళ్లే బయటపడి అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. నిజానికి సినిమారంగంలో ప్రేమ వివాహాలు ఆ తర్వాత విడాకులు కామన్ అయిపోయాయి. ఒకప్పుడు బాలీవుడ్లో ఈ కల్చర్ ఎక్కువగా ఉండేది, ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం ఆ కొన్నాళ్లకే మళ్ళీ విడిపోవడం అక్కడయితే కామన్.

  Recommended Video

  Naga Chaitanya Samantha Divorce, ఆమెపై దుష్ప్రచారం వద్దు | #ChaySam || Filmibeat Telugu
  ముందు నుంచే ప్రచారం

  ముందు నుంచే ప్రచారం

  ఇక ఇప్పుడు టాలీవుడ్ లో సమంత -నాగచైతన్య మధ్య విభేదాలతో విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి టాలీవుడ్ లోనే కాక నేషనల్ వైడ్ గా కూడా ఈ జంటకి చాలా ఫాలోయింగ్ ఉంది. వీరి వివాహం జరిగినప్పుడు కూడా నేషనల్ మీడియా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. అయితే పెళ్లి అయిన నాటి నుంచి అన్యోన్యంగా ఉండే ఉంటున్న ఈ జంట మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి అనే ప్రచారం కొన్నాళ్ల నుంచి బాగా జోరందుకుంది. అయితే ఈ విషయం మీద సమంత కానీ, అక్కినేని ఫ్యామిలీ కానీ ఎక్కడా నేరుగా స్పందించలేదు.

  తిరుమలలో అలా

  తిరుమలలో అలా

  అయితే సమంత మాత్రం మీమ్స్ తో మీడియా ఈ విషయాన్ని ఎక్కువ చేసి చూపుతోందని, కౌంటర్లు వేసింది కానీ నేరుగా స్పందించలేదు. ఇక వ్యక్తిగత సిబ్బందికి సెలవులు ఇచ్చి తను కూడా టూర్స్ వేస్తున్న క్రమంలో దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయారు. దానికి తోడు తిరుమల వెళ్లి అక్కడ రిపోర్టర్ ను బుద్ధి ఉందా? అని ప్రశ్నించడంతో అది కూడా హాట్ టాపిక్ అయింది.

  అప్పుడే వివరాలు లీక్

  అప్పుడే వివరాలు లీక్


  ఆ తరువాత ఒక ఛానల్ వెబ్ సైట్ లో కూడా నాగచైతన్య-సమంత నిజంగానే విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారని... ప్రస్తుతం అది ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ స్టేజ్ లో ఉందని వార్త వచ్చింది. అయితే అసలు ఈ విడాకుల ఎందుకు అంటే ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇరు కుటుంబాల వల్ల కూడా వాళ్ళకు నచ్చచెప్పడం కుదరకపోవడంతో విడాకులకు అప్లై చేయడం, ఆ వ్యవహారం కౌన్సిలింగ్ వరకు వెళ్లడం కూడా అయిందని అన్నారు.

  ఇక అఫీషియల్

  ఇక అఫీషియల్


  అయితే అంతా ప్రచారం జరిగినట్టుగానే కొద్ది సేపటి క్రితం నాగచైతన్య తాను సమంతతో విడిపోతున్నా అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అనేక సార్లు చర్చలు జరిపి, అనేక ఆలోచనలు చేసిన తర్వాత సమంత నేను భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక దశాబ్ద కాలానికి పైగా మంచి స్నేహం కలిగి ఉండటం మా అదృష్టం అని చైతన్య చెప్పుకొచ్చాడు.

  పదేళ్ళ స్నేహం

  పదేళ్ళ స్నేహం

  అలాంటి పదేళ్ల స్నేహం మా మధ్య ఒక ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నాను అని నాగచైతన్య పేర్కొన్నారు. ఈ క్లిష్టమైన సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషులు మీడియా కూడా మాకు మద్దతు ఇవ్వాలని మేము మరింత ముందుకు సాగడానికి అవసరమైన ప్రైవసీ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నా అని ఆయన ట్వీట్ చేశాడు. అయితే చైతన్య పోస్ట్ చేసిన పోస్తూనే కొంచెం మర్చి సమంత కూడా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే

  నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో హిట్ కొట్టగా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థాంక్యూ, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో బంగార్రాజు సినిమాలు చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం తెలుగులో పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె హీరోయిన్ గా టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది.


  English summary
  Samantha Akkineni and Naga Chaitanya announce divorce.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X