For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫ్యాన్ చేసిన పనికి షాకైన సమంత, నాగ చైతన్య.. ఊహించని రీతిలో రిప్లై ఇచ్చారు.!

  By Manoj
  |

  మన దేశంలో సినిమా స్టార్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని వింత వింత సంఘటనలు ఇక్కడ కనిపిస్తాయి. నటీనటుల పట్ల తమ అభిమానం చాటుకునేందుకు చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాదు, చాలా చోట్ల తమ అభిమాన నటులను దేవుళ్లుగా కొలిచే సంప్రదాయం కూడా ఇక్కడ కనిపిస్తుంది. గతంలో దక్షిణాదిలో కుస్భూ సహా కొందరు నటీమణులకు గుడి కట్టిన సందర్భాలు కూడా చూశాం. అయితే, తాజాగా తెలుగు రాష్ట్రంలో ఓ అభిమాని తనకు ఇష్టమైన అక్కినేని హీరో నాగ చైతన్య కోసం పెద్ద సాహసమే చేశాడు. దీంతో సమంత, చైతూ ఇద్దరూ దీనిపై స్పందించారు. దీంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆ ఫ్యాన్ ఏం చేశాడు..? వివరాల్లోకి వెళితే..

  ఇద్దరూ కలిసి హిట్ కొట్టారు

  ఇద్దరూ కలిసి హిట్ కొట్టారు

  సమంత వరుస విజయాలతో దూసుకుపోతుంటే... చైతూ మాత్రం కొద్దిరోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే తన భార్య సమంతతో కలిసి నటించిన ‘మజిలీ' ద్వారా చైతూ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి ఇకపై చేసే సినిమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ అక్కినేని హీరో భావిస్తున్నాడట. ఇందులో భాగంగానే కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

  సమంత అలా.. నాగ చైతన్య ఇలా

  ‘ఓ బేబీ' తర్వాత సమంత ‘96' రీమేక్‌లో మాత్రమే నటిస్తోంది. తర్వాత కొత్తగా ఏ సినిమాకూ సంతకం చేయలేదు. అయితే, నాగ చైతన్య మాత్రం విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీ మామ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా విడుదల కాకముందే నాగ చైతన్య.. శేఖర్ కమ్ముల మూవీని ఓకే చేసేశాడు. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి నటిస్తోంది.

  ఫ్యాన్ చేసిన పనికి షాక్

  అక్కినేని నాగచైతన్య ఈ నెల 23వ తేదీన పుట్టిన రోజు జరుపుకున్నాడు. దీన్ని పురస్కరించుకుని బొబ్బిలికి చెందిన సాగర్ అనే అభిమాని సింహాచలం ఆలయం మెట్లను మోకాళ్లతో ఎక్కాడు. ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్‌లో ఉంచాడు. అందులో ‘నాగచైతన్య నిండునూరేళ్లు క్షేమంగా ఉండాలి. సమంత మేడం కూడా క్షేమంగా ఉండాలి. వాళ్లకు పుట్టబోయేది బాబే కావాలి. హ్యాపీ బర్త్‌డే చైతు బంగారం' అని పేర్కొన్నాడు.

  ఊహించని రీతిలో రిప్లై ఇచ్చిన దంపతులు

  సాగర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దీనిపై సమంత, చైతన్య స్పందించారు. ‘నవీన్.. నువ్వు చేసిన పనికి ఏమి చెప్పాలో తెలియడంలేదు..! ఈ ప్రేమకు ధన్యవాదాలు... జాగ్రత్త' అని నాగ చైతన్య ట్వీట్ చేశాడు. అలాగే, ‘ధన్యవాదాలు. ఇది నమ్మలేకపోతున్నా. మాటలు కూడా రావడంలేదు.. దయచేసి మమ్మల్ని కలవండి' అంటూ సామ్ ట్వీట్ చేసింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయిపోయింది.

  #CineBox: Tapsee Strong Counter To Reporter | Prabhas Fans Urges For #Prabhas20 Update
   గతంలో ఆ హీరో ఫ్యాన్ కూడా..

  గతంలో ఆ హీరో ఫ్యాన్ కూడా..

  సందీప్ కుమార్ అనే వ్యక్తి ఎనర్జిటిక్ హీరో రామ్‌కు వీరాభిమాని. రామ్ ఇటీవల పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన చిత్ర ‘ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా విడుదల సమయంలో బంపర్ హిట్ సాధించాలని సందీప్ తిరుపతికి మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లాడు. ఈ మేరకు హీరో రామ్‌కు ట్వీట్ చేశాడు. దీనిపై రామ్ ‘‘నటులుగా మేమెప్పుడూ మీ నుంచి ఇలాంటివి కోరుకోము. దానిని మీరు అర్థం చేసుకోవాలి. అమితమైన ప్రేమను చూపించే సమయంలో ఇలాంటివి చేయకండి'' అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

  English summary
  Actor Naga Chaitanya, the elder son of superstar Akkineni Nagarjuna, has turned 33 this year. Chaitanya debuted in the year 2009, with debut director Vasu Varma’s ‘Josh’. The film performed average at the box office but Chaitanya won the Filmfare award (South) as best debut male actor.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X