సమంత యూటర్న్‌కు లైన్ క్లియర్.. సెన్సార్ గ్రీన్ సిగ్నల్!
రంగస్థలం, మహానటి, అభిమన్యుడు లాంటి ఘన విజయాలతో దూసుకెళ్తున్న సమంత మరో హిట్‌ను ఖాతాలో వేసుకొనేందుకు రెడీ అవుతున్నారు. కన్నడలో ఘన విజయం సాధించిన యూ-టర్న్ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులను పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రానికి సెన్సార్ అధికారులు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. దాంతో ఈ చిత్రం సెప్టెంబర్ 13న రిలీజ్ అయ్యేందుకు లైన్ క్లియర్ అయింది.
కన్నడలో దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ మిస్టరీ థ్రిల్లర్‌కు చిత్రానికి కూడా డైరెక్షన్ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్‌కు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది.

యూ-టర్న్ చిత్రంలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు విడుదల కానున్నది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వైవీ కంబైన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించారు.
నటీనటులు: సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమికా చావ్లా, నరైన్
కథ, దర్శకత్వం: పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వైవీ కంబైన్స్
మ్యూజిక్: పూర్ణచంద్ర తేజస్వి
ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్
ఎడిటర్: సురేష్ మురుగన్


Click it and Unblock the Notifications











