Just In
- 2 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వైరల్‌గా రూమర్లు... క్లారిటీ ఇచ్చిన సమంత
సమంత ఇక సినిమాల నుంచి తప్పుకుంటోంది.. రెండు మూడేళ్లలో రిటైర్మెంట్ ప్రకటించబోతోందనే వార్తలు ఈ మధ్య ఓ రేంజ్‌లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాను రెండు మూడేళ్లు మాత్రమే సినిమాల్లో నటిస్తానని, అటుపై రిటైర్మెంట్ ప్రకటిస్తానని సమంతా పేర్కొన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇవి తిరిగి తిరిగి సమంత వద్దకు చేరుకున్నట్టున్నాయి. ఆ వార్తలపై తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.

రిటైర్మెంట్ అంటూ వార్తలు
తన కుటుంబం గురించి ఆలోచించవల్సిన అవసరం ఉందని, తాను 2 లేదా 3 సంవత్సరాలు తరువాత బ్రేక్ ఇస్తానని జాను ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చింది. చేసే ఏ సినిమా అయినా సరే తన పాత్రకు ప్రాధాన్యముండాలంటూ తెలిపింది.

అది తప్పుడు ప్రచారం..
అయితే ఇదే విషయాన్ని కొందరు వక్రీకరించారని, తాను రిటైర్మెంట్ తీసుకోబోతోన్నట్లు ప్రచారం చేసిందని క్లారిటీ ఇచ్చింది. రిటైర్మెంట్ తీసుకుంటానని తానెప్పుడు అనలేదని, ఓ నటిగా.. పదేళ్లు ఇలా రాణించడం చాలా కష్టంతో కూడుకున్న పని.

రేపే బ్రేక్ తీసుకోవచ్చేమో..
అందులో హీరోయిన్లకు ఇంత సుదీర్ఘ ప్రయాణం ఉండదు.. అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎప్పుడు ఉంటారో వెళ్తారో తెలీదు.. ఏ సినిమాలో ఎలా కనిపిస్తానో నాకే తెలీదు.. మనమేదీ ప్లాన్ చేసుకోలేము.. నేను రేపే బ్రేక్ తీసుకోవచ్చేమో.. అయితే అది రిటైర్మెంట్ మాత్రం కాద'ని క్లారిటీగా చెప్పేసింది.

జాను కలెక్షన్లు నిల్..
తమిళ నాట కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన 96 చిత్రాన్ని అదే మ్యాజిక్ రీక్రియేట్ చేయాలని జానుగా రీమేక్ చేశారు. అయితే మ్యాజిక్ అయితే కొద్ది స్థాయిలో రీ క్రియేట్ అయినట్టు అనిపించినా వసూళ్లు మాత్రం మరీ దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఫ్లాప్ దిశగానే నడుస్తోందని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.