నా భార్తను అన్యాయంగా లాక్కోవద్దు.. సమంతపై రాజ్ నిడిమోరు భార్య షాకింగ్‌గా!
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు ఒంటరిగానే జీవిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలు కూడా పూర్తిగా తగ్గించేసి వెబ్ సిరీస్‌లతో పాటు తనకు ఇష్టమైన ప్రపంచంలో జీవిస్తున్నారు. వెకేషన్స్, ఫారిన్ ట్రిప్స్‌తో సామ్ ఎంజాయ్ చేస్తున్నారు. అటు నాగచైతన్య కూడా సమంతతో విడిపోయాక కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్నారు. అయితే మరో హీరోయిన్ శోభిత ధూళిపాళతో ప్రేమలో పడి ఆమెను పెద్దల సమక్షంలో పెళ్లాడారు చైతూ. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ భార్యతో కలిసి సినిమాలు చేసుకుంటున్నారు. శోభిత తన జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత తండేల్‌తో హిట్ అందుకున్నారు నాగచైతన్య.
రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్?
ఎప్పుడైతే నాగచైతన్య - శోభితల పెళ్లి జరిగిందో అప్పటి నుంచి సమంత వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. చైతూ రెండో పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా మరో తోడును వెతుక్కున్నారా? అంటు సినీ జనాలు, అభిమానులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీనికి తగినట్లుగానే బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ది ఫ్యామిలీ మెన్, సిటాటెల్ వెబ్ సిరీస్‌లలో సమంత నటించారు.

రాజ్‌కు గతంలోనే పెళ్లి
ఈ వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న సమయంలో రాజ్ నిడిమోరుతో సామ్‌కి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని అంటున్నారు నెటిజన్లు. రాజ్ నిడిమోరు తెలుగువారు కావడం విశేషం. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన తన మిత్రుడు డీకేతో కలిసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లలో పలు సినిమాలు తెరకెక్కించారు. ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్ వెబ్ సిరీస్‌లతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే రాజ్‌కు గతంలోనే పెళ్లయ్యింది. ఆయన భార్య పేరు శ్యామాలిదే.
చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సామ్- రాజ్
గత కొంతకాలంగా సమంత ఎక్కడుంటే రాజ్ అక్కడ ఉంటున్నారు. కలిసి పికెల్ బాల్ ఆడుకోవడంతో పాటు సమంత నిర్మాతగా మారి నిర్మించిన శుభం సినిమాకు సంబంధించిన కొన్ని బాధ్యతలను రాజ్ పర్యవేక్షించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కలిసి వీరిద్దరూ కలిసే హాజరయ్యారు. విమానంలో రాజ్ భుజంపై సమంత వాలిపోయి కనిపించడం దుమారం రేపింది. అలాగే తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలను రాజ్‌తో కలిసి సమంత దర్శించుకోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ కలిసి అమెరికాలో విహరించగా.. ఇటీవల రాజ్ చేతిలో సమంత చెయ్యేసి నడుస్తోన్న వీడియో వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరూ ఇక తమ రిలేషన్‌ను బయటపెట్టినట్లేనని పుకార్లు గుప్పుమన్నాయి. రేపో మాపో సమంత, రాజ్ నిడిమోరులు గుడ్ న్యూస్ చెబుతారని భావిస్తున్నారు.
రాజ్ భార్య షాకింగ్ పోస్ట్
కాగా.. సమంత- రాజ్ నిడిమోరులు రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నప్పటి నుంచి రాజ్ భార్య శ్యామాలిదే ఇన్‌డైరెక్ట్‌గా స్పందిస్తున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రధానంగా ఇటీవల రాజ్- సమంతల దుబాయ్ టూర్‌నే ఆమె టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. తెలివితక్కువగా ప్రవర్తించడానికి కూడా కాస్తయినా ఇంటెలిజెంట్‌గా స్పందించాలని శ్యామాలి చురకలు వేశారు. బలవంతంగా ఏది లాక్కోకూడదని.. పంచ్‌లు విసిరింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ చిత్ర సీమలో కలకలం రేపుతుండగా.. దీనిపై సమంత, రాజ్‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











