Don't Miss!
- News
girlfriend: సీక్రేట్ గా పెళ్లి, కొండ మీద రొమాన్స్, పోలీసు అధికారి కొడుకు ఏం చేశాడంటే, ఇంట్లోనే కిల్లర్!
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Chaysam divorce: సమంత చెప్పుకోలేని చోట టాటూ.. విడాకుల తర్వాత వాటి పరిస్థితి ఏమిటి? అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న బెస్ట్ స్టేట్ కపుల్స్ లో ఒకరైన సమంత - నాగచైతన్య ఇటీవల విడిపోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుకుగా వారి విడాకులపై అనేక రకాల కథనాలు వచ్చినప్పటికీ అభిమానులు మాత్రం ఫేక్ న్యూస్ అనుకోని వదిలేశారు. ఇక శనివారం ఆ ఊహాగానాలకు ముగింపు పలికారు. నాలుగు సంవత్సరాల వివాహం తర్వాత సోషల్ మీడియాలో విడిపోతున్నట్లు ప్రకటించారు. చైసామ్ అనే ట్యాగ్ తో సోషల్ మీడియాలో కూడా ఎంతగానో క్రేజ్ అందుకున్న ఈ జంట హఠాత్తుగా విడిపోవడం అందరిని షాక్ కు గురి చేస్తోంది.
ఇక తమకు ప్రైవసీ చాలా అవసరమని అభిమానులను మీడియాను ప్రత్యేకంగా కోరారు. విడాకులు తీసుకున్నప్పటి తమ మధ్య ఎల్లప్పుడూ ప్రత్యేక బంధం ఉంటుందని కూడా చెప్పారు. అయితే సమంత నాగ చైతన్య కోసం గతంలో ప్రత్యేకంగా మూడు టాటూలని వేయించుకుంది. ఇక వాటి అర్థాల్లోకి వెళితే..

ఆ ట్యాగ్ తో ప్రేమగా..
ఈ స్టార్ జంట విడిపోయిన వార్త ఒక్కసారిగా నేషనల్ మిడియాల్ వైరల్ అయ్యింది. సమంత నాగచైతన్యను అందరూ #ChaySam అనే ట్యాగ్ తో ఆప్యాయంగా సంబోధిస్తారు. ఇక సోషల్ మీడియాలో ఆ ట్యాగ్ టాప్ ట్రెండ్‌లలో ఒకటిగా మారింది. పెళ్లి సమయంలో కూడా ఆ ట్యాగ్ బాగానే వైరల్ అయ్యింది. ఇక అభిమానుల హ్యాష్‌ట్యాగ్‌తో వీరిద్దరి రొమాంటిక్ క్షణాలను గుర్తుకు తెచ్చుకుని, వారి గత వీడియో క్లిప్‌లు మరియు అద్భుతమైన ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు.

చైతన్య గుర్తుగా మూడు టాటూలు
ఇక సమంత రూత్ ప్రభుకి మూడు టాటూలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఆమె చైతన్య కోసమే గతంలో వేయించుకుంది. ఇక ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. సమంత మూడు రకాలుగా గతంలో ప్రేమకి ప్రతిరూపంగా వాటిని డిజైన్ చేయించుకుంది.

నడుముపై నాగ చైతన్య పేరు
సమంత తన నడుము సైడ్ లో 'chay' అనే పేరును పచ్చబొట్టుగా వేయించుకుంది. కొన్నిసార్లు ఫోటోషూట్‌లో ఆ పచ్చబొట్టును హైలెట్ చేస్తూ కెమెరాలకు స్టిల్స్ కూడా ఇచ్చింది. నాగ చైతన్యపై ఆమె ఏంత ప్రేమను పెంచుకుందో ఆ టాటూతో అర్ధమయ్యింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో ఇప్పటికి అదే తరహాలో వైరల్ అవుతోంది.

'ఏమాయ చేసావే' కోసం మరో టాటూ
ఇక సమంత తన తొలి చిత్రం 'ఏమాయ చేసావే' కోసం ఒక టాటూను అంకితం చేసింది. ఆ మూవీలో నాగ చైతన్యతో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ఆ రొమాంటిక్ డ్రామా సమంత చైతు బంధానికి ఎంతో బలాన్ని ఇచ్చింది. ఇక YMC టాటూని ఆమె తన వెనుక భాగంలో వేయించుకుంది. ఆ ఫొటో కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సమంత , చైతూ ఒకే రకమైన టాటూ
ఇక సమంత కలిగి ఉన్న మూడవ టాటూ, చైతన్యతో చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నట్లు అర్దాన్ని చెనుతుంది. సమంత చైతూ ఇద్దరు కూడా ఒకే దారిలో అర్థవంతంగా వెళ్లే కపుల్స్ అని అర్థం వచ్చేలా ఒకే తరహాలో ఆ పచ్చబొట్టును వేయించుకున్నారు ఆ టాటూతోనే వారి బంధం ఎంత గొప్పదో అలా క్లారిటీ వచ్చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలలో ఒకదానిలో, సామ్ తన కుడి చేతిలో సిరా వేసుకున్న పచ్చబొట్టును ప్రదర్శిస్తోంది. అదే టాటూకి నాగ చైతన్య వారి వివాహ తేదీని మోర్స్ కోడ్‌లో జోడించారు. దీనిని సోషల్ మీడియాలో అభిమానులు చాలా రకాలుగా డీకోడ్ చేశారు. ఇక సమంత చాలాసార్లు దానిపై క్లారిటీ ఇచ్చింది.
Recommended Video

రెండు మతల్లో రెండుసార్లు వివాహం
ఇక సమంత - నాగ చైతన్య 2017 అక్టోబర్ 6వ తేదీన హిందు సంప్రదాయం ప్రకారం పెళ్లి సీబీసుకొని ఆ తరువాత 7వ తేదీన క్రిస్టియన్ పద్దతిలో మరింత దగ్గరయ్యారు. అప్పట్లో వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రముఖ OTT సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' లో చివరిసారిగా కనిపించిన సమంత అనంతరం గుణశేఖర్ యొక్క పౌరాణిక చిత్రం 'శకుంతలం' మూవీతో రాబోతోంది.. ఇక నాగ చైతన్య ఇటీవల లవ్ స్టొరీతో సక్సెస్ అందుకొని ప్రస్తుతం అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' కోసం బిజీ అయ్యాడు.