ఆ రోజు షూటింగ్ లేకున్నా వెళ్ళా.. అవన్నీ గమనించా.. ఇబ్బందిగా అనిపిస్తుంది: సమంత అక్కినేని

నాగచైతన్యతో పెళ్లి, అక్కినేని వారింట్లో అడుగుపెట్టడం సమంతకు బాగా కలిసొచ్చింది. పెళ్లి కాగానే వెంటనే రంగస్థలం సినిమాతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న సామ్.. ఆ తర్వాత వరుసపెట్టి డిఫెరెంట్ డిఫెరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. మహానటిలో జర్నలిస్టుగా, ఆ వెంటనే భర్త నాగచైతన్యతో మజిలీ సినిమాలో గృహిణిగా సమంత నటన అబ్బురపరిచింది. దీంతో సమంతకు పెళ్ళికి ముందు కంటే కూడా పెళ్లి తర్వాతే సమంతకు సినీ గ్లామర్ బాగా పెరిగిందనే టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈమె ఓ బేబీ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పెట్టింది సమంత.

మిస్ గ్రానీకి తెలుగు రీమేక్‌

మిస్ గ్రానీకి తెలుగు రీమేక్‌

కొరియన్‌ చిత్రం 'మిస్ గ్రానీ'కి తెలుగు రీమేక్‌గా రాబోతున్న సినిమానే ఓ బేబీ. ఈ చిత్రంలో సమంత మునుపెన్నడూ చేయని డిఫరెంట్ రోల్ పోషిస్తోంది. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలి ఆత్మ.. 20 ఏళ్ల వయసున్న యువతి శరీరంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే ఓ డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల రానుంది.

సీనియర్ నటితో సామ్..

ఓ బేబీ చిత్రంలో వృద్దురాలిగా సీనియర్ నటి లక్ష్మీ కనిపిస్తే.. యువతిగా సమంత కనిపించనుంది. కథలో భాగంగా లక్ష్మి ఆత్మ సమంత శరీరంలోకి వెళ్లి చేసే కామెడీ ప్రేక్షక లోకాన్ని గిలిగింతలు పెట్టేలా దర్శకురాలు నందినీ రెడ్డి స్క్రిప్ట్ రెడీ చేసి సెట్స్ పైకి తీసుకొచ్చారు.

తొలిరోజు షూట్‌లో

తొలిరోజు షూట్‌లో

చిత్ర విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చిత్ర తొలిరోజు షూట్‌లో తీసిన ఓ పిక్ షేర్ చేసింది సమంత. ఇందులో సమంతతో పాటు నటులు రాజేంద్ర ప్రసాద్‌, నాగశౌర్య, లక్ష్మి, దర్శకురాలు నందినిరెడ్డి కనిపిస్తున్నారు. మోడ్రెన్ లుక్ లో సమంత హ్యాపీ మూడ్‌లో కనిపిస్తోంది. నందినీ రెడ్డి సమంత గురించి నటి లక్ష్మికి ఏదో విషయం చెబుతున్నట్లుగా కనిపిస్తోంది.

 ఆ రోజు నాకు షూటింగ్‌ లేదు.. సామ్ మెసేజ్

ఆ రోజు నాకు షూటింగ్‌ లేదు.. సామ్ మెసేజ్

సిసిల మీడియాలో ఈ పిక్ పోస్ట్ చేసిన సమంత ఓ మెసేజ్ కూడా పెట్టింది. ''ఓ బేబీ సినిమా తొలిరోజు షూటింగ్‌ లో తీసిన ఫొటో ఇది. ఆ రోజు నాకు షూటింగ్‌ లేదు. అయినా స్టడీ కోసం వెళ్లాను. లక్ష్మి ఎలా నడుస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు మొదలైనవన్నీ గమనించా. నా కొత్త సినిమా ప్రారంభం అవుతుందంటే చాలు.. దానికి ముందు రోజు నేనెప్పుడూ ఇబ్బందిగా ఫీల్‌ అవుతుంటా. త్వరలో ‘ఓ బేబీ' విడుదల కాబోతోంది'' అని పేర్కొంది సామ్.

ఓ బేబీ మూవీ

ఓ బేబీ మూవీ

నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ బేబీ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ వారు సంయుక్తంగా సమర్పిస్తున్నారు. చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. లక్ష్మీ, నాగ శౌర్య, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు. జులై నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ విశేష స్పందన తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X