Just In
- 1 hr ago
ట్రెండింగ్ : ఆనందంలో తప్పు చేసేసింది!.. 18 నెలల కాపురం.. సంచలనం రేపుతున్న కిమ్
- 2 hrs ago
ఐటీ రైడ్స్ అయినా కూడా.. అనురాగ్ కశ్యప్ రియాక్షన్ ఇదే!
- 3 hrs ago
సినిమా కోసం నిజంగానే పంట పండించారట కానీ.. ‘శ్రీకారం’ సీక్రెట్స్ ఇవే!
- 3 hrs ago
ప్రభాస్‌కు అలాంటి వాటిపై ఆసక్తి ఉండదు.. నాగ్ అశ్విన్ కామెంట్స్ వైరల్
Don't Miss!
- News
అమానుషం.. సర్జరీ చేసి కుట్లు వేయకుండా... బాధతో విలవిల్లాడుతూ చిన్నారి మృతి...
- Sports
India vs England: బెయిల్ దాచేసిన రిషబ్ పంత్.. వెతికిన అంపైర్, ఆటగాళ్లు! చివరకు!
- Finance
భారీగా క్షీణించిన ఎలాన్ మస్క్ సంపద, ఎందుకంటే?
- Lifestyle
Makeup Tips:మీకు అందమైన లుక్ కావాలంటే... మీ స్కిన్ టోన్ కు ఏ లిప్ స్టిక్ సెట్ అవుతుందో చూసెయ్యండి...
- Automobiles
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ సినిమాలో సీనియర్ డైరెక్టర్ కీలక పాత్ర: ఆ హీరోకు తండ్రిగా నటించనున్నాడు
సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే సినిమాను చేస్తున్న ఆయన.. వరుసగా కొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేశాడు. గతంలోనే క్రిష్ జాగర్లమూడితో ఓ సినిమాను, హరీశ్ శంకర్‌తో మరో సినిమాను ప్రకటించాడు. వీటిని వరుసగా పూర్తి చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా 'అయ్యప్పనుమ్ కోషియం' అనే మలయాళ సినిమా రీమేక్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.
సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'అయ్యప్పనుమ్ కోషియం' అనే సినిమాను రీమేక్‌లో నటిస్తున్నాడు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఇందులో అత్యంత కీలకమైన హీరో (రానా) తండ్రి పాత్రను సీనియర్ డైరెక్టర్, విలక్షణ నటుడు సముద్రఖని పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది.

రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'క్రాక్'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఇందులో హీరో తర్వాత విలన్ కటారి కృష్ణ పాత్రను పోషించిన సముద్రఖని గురించే అంతా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. పవన్ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌లో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఏ పాత్ర అనేది చెప్పలేదు కానీ.. ముఖ్యమైన రోల్ అని మాత్రం చెప్పుకొచ్చారు.