62 ఏళ్ల వయసులో హీరోయిన్‌తో మూడో పెళ్లి? వీడియోతో షాకిచ్చిన లెజండరీ యాక్టర్
సినీ పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు, ఎఫైర్లు, విడాకులు చాలా కామన్. ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో? ఎవరు విడిపోతారో? తెలియదు.. సడెన్‌గా నటీనటులు షాకిస్తుంటారు. మరికొన్ని జంటలైతే ప్రేమకు, పెళ్లిళ్లకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తుంటాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ 60 ఏళ్ల వయసులో మూడోసారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక తమకన్నా వయసులో చిన్న వారిని పెళ్లి చేసుకున్న స్టార్స్ ఉన్నారు. తాజాగా ఓ సీనియర్ నటుడు 62 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీకి అవ్వడంతో బాలీవుడ్ షాకైంది. ఈ వివరాల్లోకి వెళితే..
35 ఏళ్ల నట జీవితం
టీవీ, సినీనటుడిగా భారతీయ చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు సంజయ్ మిశ్రా. బీహార్‌కు చెందిన ఈ నటుడు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో గ్రాడ్యుయేషన్ చేశారు. 1991లో దూరదర్శన్‌లో ప్రసారమైన చాణక్య అనే సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత 1995లో ఓ డార్లింగ్ ఏ హై ఇండియా అనే సినిమాతో సినీరంగంలోనూ అవకాశం దక్కించుకున్నారు. ఇక అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. సత్య, దిల్ సే, బంటీ ఔర్ బబ్లీ, అప్నా సప్నా మనీ మనీ తదితర సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జమీన్, చారస్, ప్లాన్, సత్య, కిక్, అంకోన్ దేఖి తదితర చిత్రాలతోనూ ఫేమస్ అయ్యారు. మూడున్నర దశాబ్ధాల కెరీర్‌లో వందలాది చిత్రాలు, సీరియల్స్‌లో నటించి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్నారు సంజయ్ మిశ్రా.

బిజీగా సంజయ్ మిశ్రా
సంజయ్‌కి తొలుత రోషినీ అచ్రేజాతో 1991లో వివాహం జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగగా... ఆ తర్వాత రోషినీ- సంజయ్ మధ్య మనస్పర్దలు చోటు చేసుకోవడంతో ఇద్దరూ విడిపోయారు. అనంతరం 2009లో కిరణ్ మిశ్రాను సంజయ్ రెండో పెళ్లి చేసుకున్నారు. సంజయ్‌కి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఆయన దుర్లబ్ ప్రసాద్ కి దుస్రి షాదీ, వధ్ 2 సినిమాలలో నటిస్తున్నారు. ఈ వయసులోనూ సంజయ్ ఫుల్ బిజీగా ఉండటం విశేషం. ఆయన కోసం దర్శక నిర్మాతలు విలక్షణ పాత్రలు సిద్ధం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ వీడియోతో సంజయ్ మిశ్రా షాకిచ్చారు.
మహిమా చౌదరితో సంజయ్ మిశ్రా పెళ్లి?
బాలీవుడ్ నటి మహిమా చౌదరితో సంజయ్ పెళ్లి బట్టల్లో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరూ బయటికి వచ్చి మీడియా ఎదుట ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని బీటౌన్ ఉలిక్కిపడింది. మహిమా చౌదరి ఒకప్పుడు తన అందం, అభినయంతో బాలీవుడ్‌ను ఊపేసింది. 2006లో ఆర్కిటెక్ట్ బాబీ ముఖర్జీని పెళ్లాడింది. అయితే వీరి మధ్య మనస్పర్ధులు చోటు చేసుకోవడంతో బాబీ, మహిమాలు 2013లో విడిపోయారు. 52 ఏళ్ల మహిమా చౌదరి రెండో పెళ్లిపై గతంలోనే పలుమార్లు ఊహాగానాలు వినిపించాయి. దాంతో మహిమా - సంజయ్‌లు పెళ్లి చేసుకున్నారని అంతా భావించారు.
షాకిచ్చిన సీనియర్స్
ఇంతలో వారిద్దరూ షాకిచ్చారు. ఇదంతా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే చేశామని క్లారిటీ ఇచ్చారు. సంజయ్ మిశ్రా, మహిమా చౌదరిలు ప్రస్తుతం దుర్లభ్ ప్రసాద్ కీ దుస్రీ షాదీ అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు. రెండో పెళ్లి చుట్టూ తిరిగే కథ కావడంతో అందుకు తగినట్లుగానే ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపట్టారు మేకర్స్. సంజయ్ వరుడి బట్టల్లో, మహిమ వధువు దుస్తుల్లో ఫోటోలకు ఫోజులిచ్చారు. అసలు విషయం తెలియడంతో బాలీవుడ్ వర్గాలు ఊపిరీ పీల్చుకున్నాయి.


Click it and Unblock the Notifications











