రవితేజ సినిమా గురించి దర్శకుడు ఎలివేషన్స్.. అప్పటిదాకా ఓర్చుకోండి, ప్లీజ్..ప్లీజ్!

కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఇప్పటికే ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. రాక్షసుడు సినిమా తో హిట్ కొట్టిన మళ్లీ ఫాంలోకి వచ్చిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే తాజాగా రమేష్ వర్మ కరోనా బారిన పడటంతో పాటు లాక్ డౌన్ కూడా మొదలు కావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా పూర్తయిన తర్వాత రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది.

అయితే ఈ సినిమాలు లైన్ లో ఉండగానే ఆయన మళ్లీ కథలు వినడం మొదలు పెట్టాడు. అయితే ఆయన ఈ ఏడాది మొదట్లో కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. షూట్ ఇప్పుడే ప్రారంభించాల్సి ఉన్నా కరోనా రెండవ వేవ్ కారణంగా ఆగింది. ఇక ఈ సినిమా హీరోయిన్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి పలు పుకార్లు గత వారం రోజులుగా మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో శరత్ వాటిని నిరాధారమైన వార్తలు అని కొట్టిపారేసి, అభిమానులను నమ్మవద్దని కోరారు.

Sarath Mandava clarity about ravi teja film

ఫస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని, టైటిల్ కిక్కాస్ గా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు, మేము చిత్రీకరణ ప్రారంభించే వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వాలనుకోవడం లేదు, జూలైలో షూట్ మొదలవచ్చు, నేను మీకు భరోసా ఇస్తున్నాను, టైటిల్ - కికాస్, ఫస్ట్ లుక్ -మైండ్ బ్లోయింగ్, థీమ్ సాంగ్ - ఎప్పుడూ ఊహించనిదని ఎలివేషన్స్ పెంచినా ఆయన నేను కూడా మీలాగే ఆసక్తికరంగా ఉన్నాను కాని పరిస్థితులు బాలేదని పేర్కొన్నాడు. ఇక అలా మొత్తం మీద సినిమా మొదలు కూడా కాకుండానే సినిమా మీద అంచనాలు పెంచుతున్నాడు ఆయన.

More from Filmibeat

Read more about: ravi teja రవి తేజ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X