Sarileru Neekevvaru Pre Release Event : మహేష్‌తో హ్యాట్రిక్.. దేవీతో పన్నెండో సినిమా : దిల్ రాజు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి. అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది.

ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది. మరి ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ ఓ సారి చూద్దాం..

Sarileru Neekevvaru Pre Release Event Dil Raju Speech

దిల్ రాజు మాట్లాడుతూ.. 'ట్రైలర చూశారుగా ఎలా ఉంది.. రేపు 11న థియేటర్లలో రచ్చ రచ్చ.. మహేష్‌తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..మహర్షి, ఇప్పుడు సరిలేరు హ్యాట్రీక్ కొట్టబోతోన్నాము. నేను చాలా లక్కీ. దేవీతో ఇది పన్నెండో సినిమా. ఇప్పటి వరకు 11 సక్సెస్‌లు చూశాము. ఇది పన్నెండో విజయం.. పటాస్ మినహా మిగితా సినిమాలన్నీ మా బ్యానర్‌లోనే చేశాడు అనిల్ రావిపూడి. ఆయన తీసే అన్ని సినిమాలు హిట్ కావాలనికోరుకుంటున్నాను.

విజయశాంతి గారిని 1992న శత్రువు షూటింగ్‌లో భాగంగా ఇక్కడే చూశాను. మళ్లీ ఆమెను ఇక్కడే చూడటం ఆనందంగా ఉంది. మా బ్యానర్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. రష్మిక మందాన్న గురించి నేను చెప్పెదేమీ లేదు. ఆల్రెడి ట్రైలర్‌లో చూశారు కదా. ఎఫ్‌2లో అంతేగా అంతేగా అన్నట్టు.. ఈ సినిమాలో అర్థమవుతుందా? అంటూ మ్యానరిజం బాగుంటుంది. థియేటర్లలోంచి బయటకు వచ్చేప్పుడు మీరంతా కూడా అదే అనుకుంటూ వస్తార'ని అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X