For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సర్కారు వారి పాట’ సెట్స్ వీడియో లీక్: మహేశ్ బాబును అడ్డుకున్న భద్రతా సిబ్బంది

  |

  'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' ఇలా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగానే ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇక, ఇప్పుడు ఈ స్టార్ హీరో 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ స్పాట్‌లో తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే

  సర్కారు వారి పాట అంటోన్న మహేశ్

  సర్కారు వారి పాట అంటోన్న మహేశ్

  ఫుల్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది సంక్రాంతికి రాబోతుంది.

  షర్ట్ విప్పేసి బ్రా తీసేసి అషు రెడ్డి రచ్చ: హాట్ షోలో హద్దు దాటేసి.. మరీ ఇలా చూపిస్తారా!

  మూవీ స్టోరీ ఇదేనట.. పాత మహేశ్‌ను

  మూవీ స్టోరీ ఇదేనట.. పాత మహేశ్‌ను

  'సర్కారు వారి పాట' మూవీ బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ రూపొందుతోంది. హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతాడు. అప్పుడు హీరో.. తన తండ్రి నిజాయితీని నిరూపించేందుకు విలన్‌ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ అంటున్నారు. ఇక, ఇందులో వింటేజ్ మహేశ్ బాబును చూపించబోతున్నారట.

  ఆ వీడియోతో రికార్డులు క్రియేట్ చేసి

  ఆ వీడియోతో రికార్డులు క్రియేట్ చేసి

  గత ఆగస్టులో 'సర్కారు వారి పాట' నుంచి టీజర్ విడుదలైంది. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ 24 గంటల్లోనే 23.06 మిలియన్ వ్యూస్‌ను, 7 లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకుంది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కరోజులో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా టాలీవుడ్‌లో చరిత్రను సృష్టించింది.

  అరాచకమైన హాట్ ఫొటోను వదిలిన విష్ణుప్రియ: ఆమెను ఈ ఘాటు ఫోజులో చూస్తే అస్సలు తట్టుకోలేరు

  అప్పుడే బిజినెస్.. భారీ ధరలకు క్లోజ్

  క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'సర్కారు వారి పాట' మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు అప్పుడే బిజినెస్ కూడా ప్రారంభం అయిందని తెలుస్తోంది. ఇప్పటికే పలు ఏరియాల రైట్స్‌ను భారీ ధరలకు అమ్మేశారని అంటున్నారు. ఇందులో కూడా మహేశ్ బాబు రికార్డులు క్రియేట్ చేశాడని సమాచారం.

  షూటింగ్ అప్‌డేట్ ఇదే.. అంతే ఉంది

  షూటింగ్ అప్‌డేట్ ఇదే.. అంతే ఉంది

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా ఫారెన్ షెడ్యూల్‌ను జరుపుకుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా షూట్ చేశారు. ఇక, ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. అంటే దాదాపు 20 శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉందని టాక్.

  బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ సరసాలు: ఏకంగా అతడి మీద పడుకుని.. వామ్మో ఇది మహా దారుణం!

  Recommended Video

  Comedian Sudarshan About Manchi Rojulochaie | Santosh Shobhan | Part 03
  మూవీ సెట్స్ వీడియో లీక్.. ఏముంది?

  మూవీ సెట్స్ వీడియో లీక్.. ఏముంది?

  తాజాగా 'సర్కారు వారి పాట' మూవీ నుంచి షూటింగ్ స్పాట్‌ వీడియో లీకైంది. ఇందులో మహేశ్ బాబు మెట్రో స్టేషన్ దగ్గర రోడ్డుపై వెళ్తుండగా.. అక్కడి భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకుంటారు. అప్పుడు వాళ్లతో అతడు మాట్లాడుతుంటాడు. అదే సమయంలో అక్కడకు ఎవరో ప్రజాప్రతినిధి వస్తారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. Now This Movie Sets Video Viral in Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X