For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sarkaru Vaari Paata Trailer: కళావతి కోసం దిగజారిపోయిన మహేష్.. దూల తీరిపోతోంది అంటూ..

  |

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి రాబోతున్న తదుపరి సినిమా సర్కారు వారి పాట పై అంచనాలు రోజురోజుకు అమాంతంగా పెరిగి పోతున్నాయి. గీత గోవిందం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు పరశురామ్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈనెల 12వ తేదీన విడుదల కాబోతోంది. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా నేడు సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మహేష్ బాబు గతంలో ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ స్టైల్ లో ఆదరగొట్టేశాడు. ఇక సినిమా ట్రైలర్ మొత్తంగా ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..

  భారీ స్థాయిలో హైప్

  భారీ స్థాయిలో హైప్

  మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక బ్యాంక్ రికవరీ ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేశాయి. ఇక చిత్ర యూనిట్ సభ్యులు కూడా సినిమా గురించి అనేక విషయాలను తెలియజేస్తూ ఆసక్తిని కలిగించారు.

   పాజిటివ్ వైబ్రేషన్స్

  పాజిటివ్ వైబ్రేషన్స్

  మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా కళావతి పాట యూ ట్యూబ్ లో 150 మిలియన్ల వ్యూవ్స్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అలాగే సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది.

  ట్రైలర్ అదిరింది

  ట్రైలర్ అదిరింది

  ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కోసం గత కొన్ని రోజులుగా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా సోమవారం రోజు ఈ సినిమా ట్రైలర్ అనుకున్న సమయానికి విడుదల చేశారు. ట్రైలర్లో మహేష్ బాబు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో దర్శనమిచ్చాడు. ఒకవైపు స్మార్ట్ గా కనిపిస్తూనే మరొకవైపు మాస్ లుక్కుతో అంచనాలను మరింతగా ఏం పెంచేశాడు.

  దూల తీరిపోతొంది అంటూ..

  దూల తీరిపోతొంది అంటూ..

  నువ్వు నా ప్రేమను దొంగలించగలవు, నా స్నేహాన్ని దోంగలించగలవు.. కానీ నా డబ్బును దొంగలించలేవు అంటూ మహేష్ ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. అంతే కాకుండా అమ్మాయిలను అప్పు ఇచ్చే వాళ్ళని పాంపర్ చేయాలని కీర్తి సురేష్ తో కామెడీగా రొమాంటిక్ మహేష్ చూపించిన హావభావాలు బాగున్నాయి. అతనికి తోడు వెన్నెల కొషోర్ మీరు అమ్మాయిల విషయంలో మరీంత దిగజరిపోతున్నారు అనే కామెంట్ చేశాడు. ఇక వయసు విషయంలో మహేష్ తనకు తానే సెటైర్ వేసుకునే విధంగా మెయింటైన్ చేయలేక దూల తీరిపోతోంది అనడం హైలెట్ గా ఉంది.

  మరోక లెవెల్..

  మరోక లెవెల్..

  ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది అని అనిపిస్తుంది. దర్శకుడు పరశురామ్ మేకింగ్ స్టైల్ కూడా చాలా విభిన్నంగా ఉంది. దానికి తోడు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరొక లెవెల్ అని చెప్పవచ్చు. కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా సినిమాను చూడొచ్చు అని ట్రైలర్ ద్వారానే చెప్పేశారు.

  ట్రైలర్ ట్రెండింగ్

  సర్కారు వారి పాట ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తోంది. చూస్తుంటే 24 గంటల్లో అత్యధిక మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్ గా కూడా సెన్సేషన్ క్రియేట్ చేయవచ్చు అని అనిపిస్తోంది. ఇప్పటికే సినిమా పాటలు యూట్యూబ్ లో అత్యధిక మిలియన్ వ్యూవ్స్ అందుకున్న సౌత్ ఇండియన్ లిరికల్ సాంగ్స్ గా రికార్డును క్రియేట్ చేశాయి. మరి ఈ ట్రైలర్ ఇంకా ఏ స్థాయిలో వ్యూవ్స్ అందుకుంటుందో చూడాలి.

  English summary
  Sarkaru vaari Paata Trailer Is Out: Mahesh Babu Is Back With Commerical entertainer
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X