Don't Miss!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- News
తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ ఉంటారు..!!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Kaikala Satyanarayana: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. నవరస నట సార్వభౌమ కన్నుమూత
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా వరుసగా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో ఎంతో మంది ప్రముఖులు ప్రాణాలు విడిచారు. మరీ ముఖ్యంగా రెండు మూడు నెలల వ్యవధిలో కృష్ణంరాజు, కృష్ణ వంటి దిగ్గజ నటులను పరిశ్రమ కోల్పోయింది. దీంతో చిత్ర రంగానికి తీవ్ర లోటు ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నట శిఖరం నేలకొరిగింది. దాదాపు ఆరు దశాబ్దాలకు పైగానే టాలీవుడ్‌లో నటుడిగా సత్తా చాటి లెజెండరీ యాక్టర్‌గా పేరొందిన కైకాల సత్యనారాయణ కాసేపటి క్రితమే తుది శ్వాసను విడిచారు.

అనారోగ్యంతో ఇబ్బందులు
సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ.. కొంత కాలంగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన తరచూ అస్వస్థతకు గురవుతూ వచ్చారు. ఇలా ఇప్పటికే పలుమార్లు ఆస్పత్రికి వెళ్లి చికిత్స కూడా తీసుకున్న విషయం తెలిసిందే.
Dhamaka Twitter Review: ధమాకాకు అలాంటి టాక్.. అసలైందే మైనస్‌గా.. రవితేజ మూవీ హిట్టా? ఫట్టా?

ఇంట్లోనే కన్నుమూసిన స్టార్
అనారోగ్య కారణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న కైకాల సత్యనారాయణ (87).. శుక్రవారం తెల్లవారుజామున మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాయ ఛాయలు అలముకున్నాయి.

దిగ్గజ నటుడికి సంతాపంగా
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణంతో సినీ పరిశ్రమలో విషాద పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కైకాల సత్యనారాయణ మరణంపై పోస్టులు చేస్తున్నారు.
Keerthi Remuneration: జాక్‌పాట్ కొట్టిన కీర్తి భట్.. అందరి కంటే ఎక్కువ.. రెమ్యూనరేషన్‌తో రికార్డ్

అంత్యక్రియలు ఎప్పుడంటే
కైకాల సత్యనారాయణ మరణ వార్త ఇటు సినీ పరిశ్రమలోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదాన్నే నింపింది. ఇక, ఆయన భౌతిక కాయాన్ని ఇంటి దగ్గరే ఉంచుతారని తెలిసింది. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్‌కు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, కైకాల అంత్యక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని తాజాగా సమాచారం.

అన్ని వందల సినిమాలతో
కైకాల సత్యనారాయణ 1959లో వచ్చిన 'సిపాయి కూతురు' అనే చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా, హీరోగా చాలా పాత్రల్లో దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఆయన చివరిగా 'మహర్షి' చిత్రంలో కనిపించారు.
Shrihan Remuneration: శ్రీహాన్ గెలిచింది 45 లక్షలు.. రెమ్యూనరేషన్ భారీగా.. ట్యాక్సులు పోను ఎంతంటే!

సత్యనారాయణ నేపథ్యం
కైకాల సత్యనారాయణ 1935లో కృష్ణా జిల్లా, కౌతవరం మండలం, గుడ్ల వల్లేరులో జన్మించారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, కుమారులు ఉన్నారు. సినిమాల మీద ఉన్న మక్కువతో స్టేజ్ ప్రోగ్రామ్‌లలో నటించి మెప్పించిన కైకాల సత్యనారాయణ.. ఆ తర్వాత మద్రాసు వెళ్లారు. ఈ క్రమంలోనే నటుడిగా ప్రయాణాన్ని మొదలెట్టి.. పెద్ద పెద్ద స్టార్లతో పోటీగా నటించి మెప్పించారు.