సల్మాన్ ఖాన్‌తో షారుక్ ఖాన్ మరోసారి.. పాత గొడవలన్నీ మరిచి..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ మధ్య స్నేహబంధం రోజు రోజుకు బలపడుతున్నట్టు కనిపిస్తున్నది. గతంలో ఓ పార్టీలో గొడవ పడిన వీరిద్దరూ.. కొంతకాలం దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రెండేళ్లుగా ఒకరి సినిమాలో మరొకరు కనిపిస్తూ మరింత దగ్గరవుతున్నారు.
గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్రంలో షారుక్ అతిథి పాత్రలో హంగామా చేశాడు. మెజిషియన్‌గా ఓ చిన్న పాత్రలో మెరిసాడు. ఆ తర్వాత షారుక్ ఖాన్ నటించిన జీరో సినిమాలో సల్మాన్ ఓ పాటలో గెస్ట్‌గా నటించాడు.
మరోసారి వీరిద్దరూ కలిసి కనిపించబోతున్నారనే విషయం బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నది. సల్మాన్ సొంత ప్రొడక్షన్‌లో రూపొందుతున్న దంబంగ్ 3 సినిమాలో షారుక్ ఖాన్ నటిస్తున్నారనే విషయం బాలీవుడ్‌లో వైరల్‌గా మారింది.

దంబంగ్ 3 చిత్రంలో వచ్చే ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఓ కీలక పాత్ర ఉందట. దాని కోసం ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో సల్మాన్ తన మిత్రుడు షారుక్‌ను అడిగారట. అందుకు షారుక్ ఓకే చెప్పినట్టు బాలీవుడ్ పత్రిక వెల్లడించింది.
దంబంగ్ 3 సినిమా షూటింగ్ ఇటీవల మధ్య ప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది. త్వరలోనే ముంబైలో రెండో షెడ్యూల్ మొదలవుతుందని చిత్ర యూనిట్ వెల్లడించినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











