Ram Charan ఆస్కార్ అవార్డును ఒక్కసారి తాకనిస్తారా? RRR గురించి షారుక్.. రాంచరణ్ దిమ్మతిరిగే జవాబు!
పఠాన్ సినిమా ప్రమోషన్స్‌కు సిద్దమవుతున్న షారుక్ ఖాన్ దక్షిణాది సినిమా రంగంపై ఫోకస్ పెట్టారు. తెలుగు, తమిళ హీరోలతో తనకు ఉన్న పరిచయాన్ని అభిమానులకు తెలిజెప్పుతూ ఆసక్తికరమైన ట్వీట్లు చేసి తన అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకొన్నారు. అయితే షారుక్ ఖాన్‌ను ఉద్దేశించి మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేసిన ట్వీట్, అలాగే రాంచరణ్‌ను ఉద్దేశించిన షారుక్ ఖాన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ల వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం రాంచరణ్, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ అందరూ RRR సినిమాను ఆస్కార్ పోటీలో గట్టిగా నిలిపేందుకు భారీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. లాస్ ఎంజెలెస్‌లో ఇటీవల సినిమాను ప్రదర్శించగా భారీ ఆదరణ లభించింది. ఫిబ్రవరిలో జరిగే ఆస్కార్ పోటీలో అవార్డులను గెలుచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో రాంచరణ్ కాస్త సమయాన్ని తీసుకొని.. పఠాన్ టీమ్ ఆల్ ది బెస్ట్. మీరు ఇంతకు ముందు ఎన్నడూ చేయని విధంగా యాక్షన్ల సీన్లు సినిమాలో చేసినట్టు అనిపిస్తున్నది. ఆ సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నాను అని రాంచరణ్ ట్వీట్ చేశారు.

ఆస్కార్ బరిలో దిగిన RRR టీమ్‌కు ఉత్తేజం కలిగిస్తూ.. ట్వీట్ చేశారు. థ్యాంక్యూ సో మచ్ మెగా పవర్ స్టార్. మీరు ఇండియాకు ఆస్కార్ అవార్డును తీసుకొచ్చినప్పుడు.. నాకు దాన్ని తాకే అవకాశం ఇవ్వండి అని షారుక్ ఖాన్ ట్వీట్ చేశారు. మీ RRR టీమ్ ఆస్కార్ ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు.. ఒక్కసారి నన్ను దానిని టచ్ చేయ్యనివ్వండి.. లవ్ యూ అంటూ తెలుగులో ట్వీట్ చేశారు.
రాంచరణ్ గురంచి షారుక్ ఖాన్ చేసిన ట్వీట్ 13 వేలకుపైగా రీట్వీట్లు చేశారు. 75 మందికి పైగా లైక్ చేశారు. అయితే షారుక్ ఖాన్ ట్వీట్‌కు రాంచరణ్ బదులిస్తూ.. తప్పకుండా షారుక్ సార్.. ఆ అవార్డు మన ఇండియన్ సినిమాదే అని రాంచరణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











