For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అంటూ బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. షకలక శంకర్ వార్నింగ్!

  |

  సినీ ఇండస్ట్రీలో రచయితలు డైరెక్టర్లుగా.. నటులు నిర్మాతలుగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా నటుడిగా సినీ కెరీర్ ను ప్రారంభించి తర్వాత ప్రముఖ నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. సినిమాలతోపాటు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్న ఆయన డైలాగ్ లకు అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పుడప్పుడు ఆయన మాట్లాడిని మాటలు వివాదాలకు కూడా దారి తీశాయి. ఈ క్రమంలో ఇటీవల రవితేజ హిట్ మూవీ ధమాకా సక్సెస్ మీట్ లో మాస్ మహారాజాను తెగ పొగిడేశాడు బండ్ల గణేష్. అంతేకాకుండా స్టార్ హీరోలపై పలు వ్యాఖ్యలు చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఇప్పుడు తాజాగా ఆయన మాటలకు కౌంటర్ ఇచ్చాడు కమెడియన్ షకలక శంకర్. అసలు ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

  ధమాకా మాస్ మీట్..

  ధమాకా మాస్ మీట్..

  మాస్ మహారాజా రవితేజ, పెళ్లి సందD మూవీ ఫేమ్ బ్యూటిఫుల్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ధమాకా. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించారు. డిసెంబర్ 23న విడుదలైన ఈ మూవీ తొలి రోజు నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటూ భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ క్రమంలో ధమాకా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ''మాస్ మీట్'' పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించింది.

  అదృష్టంతో మెగాస్టార్లు అవుతారు..

  అదృష్టంతో మెగాస్టార్లు అవుతారు..

  ధమాకా ''మాస్ మీట్''కు ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ''ధమాకా సక్సెస్ మీట్‌కు నేను ఫోన్ చేసి.. నేను వస్తానని వచ్చాను. కష్టం తెలిసిన హీరో రవితేజ. ధమాకా చిత్రంలో ఒక డైలాగ్ ఉంది. నాకు వెనుక ముందు లేకుండా ఎలా పైకి రావాలో అని చెప్పాడు. ఆ డైలాగ్ 100 శాతం కరెక్ట్. అందరూ ఒక సంవత్సరం ట్రై చేస్తారు. ఒకరు రెండేళ్లు, మూడేళ్లు ప్రయత్నిస్తారు. అదృష్టం కలిసి సూపర్‌స్టార్లు, మెగాస్టార్లు అవుతారు. పదేళ్ల పాటు.. చచ్చినా బతికినా.. ఆఖరికి ప్రొడక్షన్ అయినా సరే.. అసిస్టెంటు డైరెక్టర్ అయినా సరే అని నేను చచ్చిపోవడం ఇక్కడే (సినిమా పరిశ్రమలోనే ) అని డిసైడ్ అయి సాధించి.. గోల్ కొట్టి కొన్ని వందల మందికి అవకాశాలు ఇచ్చిన వ్యక్తి రవితేజ'' అని తెలిపారు.

  రాజయోగం థ్యాంక్స్ మీట్ లో..

  రాజయోగం థ్యాంక్స్ మీట్ లో..

  అయితే ధమాకా సక్సెస్ మీట్ లో రవితేజను పొగడటం వరకు బాగానే ఉన్నా.. రెండు మూడేళ్లు కష్టపడితే సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అవుతారు అని బండ్ల గణేష్ అనడం వివాదాస్పదమైంది. బండ్ల గణేష్ మాట్లాడిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు కమెడియన్ షకలక శంకర్. ఇటీవల రాజయోగం అనే సినిమా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో రాజయోగం థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.

  అదృష్టం కొద్దీ అయిపోరు..

  అదృష్టం కొద్దీ అయిపోరు..

  రాజయోగం సినిమాలో నటించిన షకలక శంకర్ ఆ మూవీ థ్యాంక్స్ మీట్ కు హాజరయ్యాడు. తాగుబోతు రమేష్ అతన్ని మాట్లాడాల్సిందిగా మైక్ అందించాడు. అప్పుడు "అందరికీ నమస్కారం. ఇంకెన్ని సంవత్సరాలైన మాట్లాడటం చాతకాదు. కానీ, కొంతమంది మైక్ తీసుకుని మాట్లాడతరయ్యా.. వాళ్లకు శతకోటి దండాలు. ఎట్లా మాట్లాడతారో అర్థం కాదు. నిన్నో మొన్నో ఒక ప్రొడ్యూసర్ అంటున్నాడు. ఏదో రెండేళ్లు, మూడేళ్లు ట్రై చేస్తే అదృష్టం కొద్దీ సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అయిపోతారని అన్నాడు. మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అదృష్టం కొద్దీ అయిపోరండి" అని షకలక శంకర్ అన్నాడు.

  నీ ఎదురుగా ఎవరు ఉబ్బిపోయి..

  నీ ఎదురుగా ఎవరు ఉబ్బిపోయి..

  ఇంకా షకలక శంకర్ కొనసాగిస్తూ "వాళ్లకు ఆ స్టార్ డమ్ రావడానికి ఎన్నో సంవత్సరాలు.. ఎన్నో రాత్రులు, పగళ్లు నిద్ర లేక, తిండి లేక, సరైన కునుకు లేక ఎన్నో కష్టాలు పడితే వాళ్లు స్టార్లు అయ్యారు. ఎందుకు అన్నాడో, ఏ ఉద్దేశంతో అన్నాడో అనేవాడికి ముందు అర్థం అవ్వాలి. నువ్ మైక్ తీసుకుని మాట్లాడుతున్నప్పుడు నీ ఎదురుగా ఎవరో ఒక హీరో ఉంటే.. నువ్వు ఉబ్బిపోయి.. తబ్బిపోయి.. నువ్ మైమరిచిపోయి.. నీ బుర్రలో ఏముందో కూడా మరిచిపోయి.. నువ్ ఇండస్ట్రీ చరిత్రను నిలబెట్టిన మహానుభావుల గురించి అంత చులకనగా.. తక్కువగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎవరికీ కనెక్ట్ కావాలో.. వాళ్లకు కనెక్ట్ అవుద్ది పేరు ఎందుకులే" అని తెలిపాడు. పక్కన తాగుబోతు రమేష్ వారించడంతో అక్కడితో ఆపేశాడు షకలక శంకర్.

  నవ్వుకోకపోతే రోగం..

  నవ్వుకోకపోతే రోగం..

  ఇలా బండ్ల గణేష్ పేరు చెప్పకుండా ఒక ప్రొడ్యూసర్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు షకలక శంకర్. తర్వాత రాజయోగం సినిమా గురించి పలు విషయాలు పంచుకున్నాడు. రాజయోగం సినిమా చూస్తే ఒక భోగం.. చూసి నవ్వుకోకపోతే ఒక రోగం అని పేర్కొన్నాడు షకలక శంకర్. ఇక రాజయోగం సినిమా విషయానికొస్తే.. ప్రెషర్ కుక్కర్ హీరో సాయి రోనాక్ తాజాగా నటించిన ఈ చిత్రానికి రామ్ గణపతి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 30న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.

  English summary
  Shakalaka Shankar Counter To Bandla Ganesh In Rajayogam Thanks Meet. Bandla Ganesh Says About Superstars Megastars In Ravi Teja Dhamaka Mass Meet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X