Just In
- 8 min ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
- 10 hrs ago
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
- 10 hrs ago
మరోసారి పవర్ స్టార్ పేరును వాడుతున్న వరుణ్ తేజ్
- 11 hrs ago
బైక్ పై స్టార్ హీరో వేల కిలోమీటర్ల ప్రయాణం.. ఎంత దూరం వెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Don't Miss!
- Sports
రోహిత్ ఔట్.. గిల్ హాఫ్ సెంచరీ.. భారత్ స్కోర్ ఎంతంటే?
- News
గర్జించబోతున్న కేసీఆర్... 'కమ్ బ్యాక్' కోసం భారీ బహిరంగ సభ... ఈసారి తిరుగులేని వ్యూహంతో?
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల్లు అర్జున్‌పై షకీలా షాకింగ్ కామెంట్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. ఇష్యూ హాట్ టాపిక్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మల్లూ ఆంటీ షకీలా మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో హాట్ ఇష్యూగా మారింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అర్జున్ గురించి స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచేలా మాట్లాడింది షకీలా. దీంతో ఈ టాపిక్ బన్నీ అభిమాన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే..

అల్లు అర్జున్ క్రేజ్.. ఆయన ఫాలోయింగ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీల్లోనూ సూపర్ కెర్జ్ ఉంది. 'గంగోత్రి' మొదలుకొని తాజాగా విడుదలైన 'అల.. వైకుంఠపురములో' వరకు అన్ని సినిమాలకు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఆయన ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగిపోయింది.

దేశవిదేశాల్లో బన్నీ ఫ్యాన్స్.. సింపుల్‌గా తీసేసిన షకీలా
మరోవైపు విదేశాల్లో సైతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. అందుకే ఆయన సినిమాలకు అక్కడ భారీ డిమాండ్ ఉంటుంది. బన్నీ సినిమా వస్తుందంటే చాలు దేశవిదేశాల్లోని బన్నీ ఫ్యాన్స్ తమ అభిమానం చాటుకుంటూ అన్ని ఏరియాల్లో భారీ కటౌట్స్ లాంటివి కడుతుంటారు. అలాంటి ఈ హీరో తనకు తెలియదని సింపుల్‌గా అనేసింది షకీలా.

శృంగార తారగా క్రెడిట్.. నేటికీ
శృంగార తారగా మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన షకీలా.. ఇటీవలి కాలంలో సినిమాలు తగ్గించేసిన సంగతి తెలిసిందే. కాకపోతే ఆమెను మాత్రం ఎవ్వరూ మరచిపోలేదు. ఈ నేసథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి తనకు తెలియదని చెప్పి ఇరుకున పడింది.

సోషల్ మీడియాలో రచ్చ.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిసప్పాయింట్
తన కెరీర్‌లోని ఎత్తు పల్లాలను వివరించిన షకీలా.. టాలీవుడ్ హీరోలోని అందరు హీరోల గురించి చెప్పింది. సడెన్‌గా అల్లు అర్జున్ గురించి అడగ్గానే తనకు తెలియదని అనేసింది. దీంతో ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. తెలుగు ఇండస్ట్రీలో పాటు తమిళ, మలయాళీ ఇండస్ట్రీలో సైతం మంచి గుర్తింపు ఉన్న తమ హీరో గురించి షకీలా తెలియదని చెప్పడాన్ని వారు జీర్ణంచుకోలేకపోతున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్.. సుకుమార్
ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘అల వైకుంఠపురములో' సినిమాతో సంక్రాంతి సందడి చేసి సంచలన విజయం సాధించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తన కొత్త ప్రాజెక్టు చేస్తున్నారు బన్నీ.