‘ఆడవాళ్లు మీకు జోహర్లు’ అంటోన్న శర్వానంద్: పుట్టినరోజున ప్రత్యేకమైన పోస్టర్

స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించి.. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించాడు టాలెంటెడ్ స్టార్ శర్వానంద్. ఆ తర్వాత హీరోగా మారిన అతడు.. తనలోని సహజ సిద్ధమైన నటనను ప్రేక్షకులకు చూపించి మన్ననలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మధ్యలో పరాజయాలు ఎదురైనప్పటికీ.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అతడు పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుని ఉన్నాడు. అందులో కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కిశోర్ తిరుమలతో చేస్తున్న సినిమా ఒకటి.

నేడు (మార్చి 6) శర్వానంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కిశోర్ తిరుమలతో చేస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. దీని ద్వారా చిత్ర హీరోకు శుభాకాంక్షలు తెలియజేసింది యూనిట్. ఇక, ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కన్నడ బ్యూటీ ర‌ష్మిక మందాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇక, త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. శర్వానంద్ కెరీర్‌లోనే ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి.

 Sharwanands Aadavaallu Meeku Johaarlu Poster Released

నిజానికి ఈ సినిమాను 2017లో వెంక‌టేష్‌తో చేయాల‌ని అనుకున్నాడు కిషోర్ తిరుమల. ప‌లు కార‌ణాల వ‌ల‌న చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఇప్పుడు క‌థ‌లో ప‌లు మార్పులు చేసి మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. మరోవైపు, శర్వానంద్ ఇప్పటికే నటించిన 'శ్రీకారం' మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనితో పాటు అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' అనే మల్టీస్టారర్ మూవీని కూడా చేస్తున్నాడు శర్వా. ఇందులో లవర్ బాయ్ సిద్ధార్ధ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X