Just In
- 19 min ago
Box office: అల్లరి నరేష్ 'బంగారు బుల్లోడు' మొదటి రోజు కలెక్షన్స్.. నిజంగా ఇది పెద్ద షాక్!
- 1 hr ago
విజయ్ దేవరకొండ 'లైగర్' వచ్చేది ఎప్పుడంటే.. పూరి జగన్నాథ్ జెట్ స్పీడ్ షూటింగ్
- 2 hrs ago
క్రాక్ పనైపోయినట్లే.. మెగా ప్రొడ్యూసర్ షాకింగ్ డిసిషన్.. బాక్సాఫీస్ రికార్డులకు 'ఆహా' బ్రేక్
- 2 hrs ago
బిగ్ బాస్ తర్వాత తొలి సినిమా: కథ విన్నానంటూ అభిజీత్ పోస్ట్.. చివర్లో అలా ట్విస్ట్ ఇవ్వడంతో షాక్
Don't Miss!
- Finance
ఆ టార్గెట్ చేరుకోవాలంటే ఇలా చేయాలి: నిర్మలకు మొబైల్ ఇండస్ట్రీ
- News
నిమ్మగడ్డ ఎక్కడ? భయంతో రాత్రికి రాత్రే ప్రైవేటు వాహనంలో -సుప్రీం తీర్పును బట్టి మెరుపు సమ్మె
- Lifestyle
తక్కువ ధరే కదా అనీ ఇవన్నీ తెలియకుండా సెకండ్ హ్యాండ్ కొనకండి..ప్రభావం వేరేగా ఉంటుంది
- Sports
ఫిఫాను దాటేసిన ఐసీసీ.. సోషల్ మీడియాలో రికార్డు!
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్టార్ హీరోల శకం ముగిసినట్టే.. సూపర్‌స్టార్ల హవా కనిపించదేమో! వర్మ, శేఖర్ కపూర్ ట్వీట్స్
కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా హాళ్లు మూతపడటంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ స్తంభించింది. థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో పలు సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ మంగళవారం ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
శేఖర్ కపూర్ తన ట్వీట్ ద్వారా స్పందిస్తూ.. కనీసం ఓ ఏడాదిపాటు థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తొలివారంలో రూ.100 కోట్ల హైప్‌కు ఇక కాలం చెల్లినట్టే. ఇక స్టార్ల హవా థియేటర్లలో తగ్గుముఖం పట్టడం, కనిపించకపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఎంత పెద్ద స్టార్ హీరోనైనా ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ఆశ్రయించాల్సిందే. లేదా సొంతంగా యాప్‌లను తయారు చేసుకొని రిలీజ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు అలాంటి యాప్స్ తయారు చేసుకోవడం చాలా సింపుల అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

గత కొద్దిరోజులుగా శేఖర్ చెప్పిన విషయాలనే దర్శకుడు రాంగోపాల్ వర్మ చెబుతున్నారు. ఓటీటీలదే ఇక భవిష్యత్తు. స్టార్ స్టేటస్, సూపర్ స్టార్లకు కాలం చెల్లినట్టే. ఇంట్లో సినిమా చూస్తే తెరపైన హీరోలు కనిపిస్తే ఈలలు వేసి,... కాగితాలు చల్లే కాలానికి స్వస్తి చెప్పాల్సిందే. ఇంట్లో అలాంటి పనులు చేస్తే పిచ్చోళ్ల మాదిరిగా చూస్తారు. ఎవరైనా ఈ పరిస్థితుల్లో ఓటీటీలను ఆశ్రయించాల్సిందే అని వర్మ చెబుతూ వస్తున్నారు.
ఈ క్రమంలో శేఖర్ కపూర్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ.. వినడానికి ఈ కామెంట్ చాలా సొంపుగా ఉంది. భవిష్యత్‌ను ఊహించడంలో ఇంతకు మించి మంచి రోజు ఉండదేమో అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.