twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Shilpa Shetty భర్తపై ఈడీ మనీ లాండరింగ్ కేసు.. యూకే నుంచి రాజ్ కుంద్రా పోర్న్ దందా

    |

    బాలీవుడ్ తార శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. కొద్ది నెలల క్రితం పోర్న్ వీడియోలు తీసి యాప్స్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలపై రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ కేసులో దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టగా పలు దిగ్బ్రాంతికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ విషయంలో రాజ్ కుంద్రాపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారంటే..

    హాట్ షాట్స్ కంపెనీతో లావాదేవీలు

    హాట్ షాట్స్ కంపెనీతో లావాదేవీలు

    ఈడీ అధికారుల తెలిపిన ప్రకారం.. రాజ్ కుంద్రా ఆర్మ్స్ ప్రైమ్ మీడియా లిమిటెడ్ అనే సంస్థను ఫిబ్రవరి 2019లో నెలకొల్పాడు. ఆ సంస్థ నుంచి హాట్ షాట్స్ అనే యాప్‌ను రూపొందించారు. ఆ తర్వాత హాట్ షాట్స్ యాప్‌ను యూకేలోని కెన్రీన్ అనే సంస్థకు అమ్మాడు. అయితే కేన్రిన్ అనే సంస్థను నడిపే వ్యక్తి స్వయాన రాజ్ కుంద్రాకు బావమరిది కావడమనేది దర్యాప్తులో వెలుగు చూసింది.

    యూకే నుంచి పోర్న్ దందా

    యూకే నుంచి పోర్న్ దందా

    హాట్‌స్పాట్ యాప్ కోసం పోర్న్ మూవీస్, వీడియోలు రూపొందించి.. వాటిని నెటిజన్లతో సబ్ స్క్రైబ్ చేయిస్తూ బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. వియాన్ కంపెనీకి సబ్ స్క్రైబర్లు చెల్లించిన మొత్తం చేరింది. తన బావ మరిది నడిపే కెన్రీన్ అనే సంస్థతో రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ ఇండస్ట్రీలో ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ సంస్థ ద్వారా 13 బ్యాంక్ అకౌంట్ల నుుంచి కోట్లాది రూపాయలు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి అనే విషయం బయటపడింది.

    శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా అకౌంట్లపై

    శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా అకౌంట్లపై

    హాట్ షాట్, హాట్ హిట్, బాలీఫేమ్ లాంటి యాప్‌ల ద్వారా వచ్చిన ఆదాయంపై క్రైమ్ బ్రాంచ్ అధికారులు దృష్టిపెట్టారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాకు జాయింట్ అకౌంట్ ఉంది. ఈ యాప్‌ల ద్వారా వచ్చిన ఆదాయం ఆ జాయింట్ అకౌంట్‌లోకి వెళ్లింది అనే విషయం అధికారుల దృష్టికి వచ్చింది. ఈ జాయింగ్ అకౌంట్‌లో భారీగా ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు పలు విషయాలు బయటకు వచ్చాయి. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి జాయింట్ అకౌంట్‌లో కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు జరిగాయి. వాటి గురించి పోలీసులు ఆరా తీయగా ఇద్దరూ సమాధానం చెప్పలేదు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓ రాజ్ కుంద్రాకు రెండు అకౌంట్లు ఉన్నాయి అనే విషయం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

    తాజా రాజ్ కుంద్రాపై కేసు

    తాజా రాజ్ కుంద్రాపై కేసు

    పోర్న్ వీడియోలు యూకేలో అప్‌లోడ్ చేయడం.. భారత్‌తోపాటు పలు దేశాల్లోని నెటిజన్లకు వీడియోలు అమ్మడం ద్వారా భారీగా డబ్బు సంపాదించారు. ఈ వ్యవహారం బయటకు రాగానే జూలై 19, 2021లో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రాజ్ కుంద్రా బిజినెస్ వ్యవహారాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్‌పై దృష్టి పెట్టిన ఈడీ.. తాజాగా రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేశారు.

    రాజ్ కుంద్రా చీకటి దందాపై దర్యాప్తు

    రాజ్ కుంద్రా చీకటి దందాపై దర్యాప్తు


    రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకొన్నాయి. ఉన్నతస్థాయిలో ఈ కేసును ముంబై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ కుంద్రాతో పనిచేసే భాగస్వాముల బ్యాంక్ అకౌంట్లను ఇప్పటికే సీజ్ చేశారు. కోట్లాది రూపాయలను ముంబై పోలీసులు సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురిని ప్రశ్నిస్తూ ఈ దందాలో చీకటి కోణాలను వెలికి తీస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రాపై ఈడీ అధికారులు కొరడా ఝుళిపించారు.

    English summary
    Enforcement Directorate registered a money laundering case on Raj Kundra Porn video case. ED finds some lapses in bank transactions between Raj kundra and UK based Kenrin company.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X