SIIMA awards 2019 list: దుమ్మురేపిన మహేష్, నాని, కార్తీకేయ గుమ్మకొండ

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలోని నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులతో ప్రాగణం జిగేల్ మన్నది. తెలుగు సినిమా తారలందరూ వేదిక వద్ద మెరిసారు. కోవిడ్ కారణంగా నిర్వహించలేకపోయిన సైమా అవార్డులు 2019 ఘనంగా జరిపారు. ఈ అవార్డు కార్యక్రమంలో మహేష్ బాబు, కార్తికేయ గుమ్మకొండ, నాని, అల్లు నరేష్ తదితరులు పాలుపంచుకొన్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో ఎవరెవరికి అవార్డులు లభించాయి అంటే..

SIIMA awards 2019 list

ఉత్తమ నటనను ప్రదర్శించినందుకు గాను మహర్షి చిత్రంలో మహేష్ బాబుకు ఉత్తమ అవార్డు లభించింది. రాదిక, ఎంపీ సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డును మహేష్ అందుకొన్నారు.

నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో అత్యుత్తమ ప్రదర్శన చాటినందుకు కార్తీకేయ గుమ్మకొండకు ఉత్తమ విలన్‌గా అవార్డు లభించింది. లక్ష్మీరాయ్ చేతుల మీదుగా కార్తీకేయ అవార్డును అందుకొన్నారు.

SIIMA awards 2019 list

మహర్షి చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ అవార్డు అందుకొన్నారు. సైమా అవార్డును అందుకోవడంపై దేవీ శ్రీ ప్రసాద్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

మహర్షి చిత్రంలో ఇదే కదా అనే పాటను రాసిన శ్రీమణికి ఉత్తమ గేయ రచయితగా అవార్డును అందుకొన్నారు.

మహర్షి చిత్రంలో ఉత్తమ సహయ నటుడిగా అల్లరి నరేష్‌కు సైమా అవార్డు లభించింది.

మజిలి చిత్రంలో ప్రియతమ ప్రియతమ అనే పాటను పాడిన చిన్నయికి ఉత్తమ గాయని అవార్డు అందుకొన్నారు.

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో టైటిల్‌ సాంగ్‌ను పాడిన అనురాగ్ కులకర్ణి ఉత్తమ గాయకుడి అవార్డును అందుకొన్నారు.

2019 సంవత్సరంలో జెర్సీ గ్యాంగ్ లీడర్ చిత్రాల ద్వారా అద్బుతమైన వినోదాన్ని అందించిన నానికి బెస్ట్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X