Don't Miss!
- News
స్మితా ఇంటికి ప్రమోషన్లపై చర్చించేందుకే వెళ్లా: ఆనంద్ కుమార్, రాత్రే ఎందుకంటే?
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
యాక్షన్ సీక్వెన్స్‌కు డబ్బింగ్ ఇలా.. సింగర్ హేమచంద్ర ఫన్నీ వీడియో
సింగర్ హేమచంద్ర డబ్బింగ్ చెబితే ఎంత క్లాస్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విలన్స్ అందులోనూ స్టైలీష్ విలన్స్‌కు హేమచంద్ర చెప్పే డబ్బింగ్ అదిరిపోతుంది. ధృవ సినిమాలో అరవింద్ స్వామి పాత్రకు హేమచంద్ర చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. అలా అప్పటి నుంచి స్టైలీష్ విలన్ పాత్రలకు హేమచంద్రతోనే డబ్బింగ్ చెప్పిస్తున్నారు.
ఆ మధ్య అశ్వథ్థామ చిత్రంలోనూ విలన్ క్యారెక్టర్‌కు హేమచంద్రతోనే డబ్బింగ్ చెప్పించారు. అలా సింగర్‌గానే కాకుంగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ హేమచంద్రకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. అతని వాయిస్‌కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే యాక్షన్ సీక్వెన్స్‌కు డబ్బింగ్ చెప్పడం ఎంత కష్టం.. అప్పుడు తమ పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు హేమచంద్ర. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

హూ హా అంటూ దెబ్బలు తింటోన్న వీడియోను హేమచంద్ర షేర్ చేశాడు. దానిపై తోటి సింగర్స్ పలు రకాలుగా స్పందించారు. సోనీ కొమండూరి కామెంట్ చేస్తూ.. ఆ ఫేస్ ఎక్స్ ప్రెషన్స్‌కి డైలాగ్స్ ఏం సంబంధం లేదంటూ పరువుతీసేసింది. దానిపై హేమచంద్ర స్పందిస్తూ.. వకీల్ సాబ్ స్టైల్లో అబ్జెక్షన్ అంటూ కౌంటర్ వేశాడు. మొత్తానికి హేమచంద్ర షేర్ చేసిన వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.