For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్రూరమైన నెగిటివ్ పాత్రలో సింగర్ మంగ్లీ.. స్టార్ హీరో సినిమాలో బ్యాడ్ క్యారెక్టర్

  |

  ఇటీవల కాలంలో గాయనీ గాయకులు కూడా వెండితెరపై ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. సరైన కథలు దొరికితే కొందరైతే లీడ్ రోల్స్ లో కూడా నటిస్తున్నారు. సంగీత దర్శకులు కొందరు హీరోలుగా కనిపించిన విషయం తెలిసిందే. అలాగే ఫీమేల్ సింగర్స్ కూడా అప్పుడప్పుడు స్పెషల్ పాత్రల్లో కనిపిస్తూ సినిమాలో స్పెషల్ ఏట్రాక్షన్ గా నిలుస్తున్నారు. త్వరలోనే సింగర్ మంగ్లీ కూడా ప్రత్యేకమైన పాత్రలో షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సింగర్ మంగ్లీ యాక్టింగ్ స్కిల్స్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు సినిమా పాటలతో పాటు ప్రైవేట్ సాంగ్స్ తో కూడా ఆమె తన స్థాయిని మరింత పెంచుకుంటోంది.

  నెగటివ్ పాత్రలో మంగ్లీ

  నెగటివ్ పాత్రలో మంగ్లీ

  తెలుగులో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇతర భాషల్లో కూడా పాటలు పాడుతూ మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నటన వైపు కూడా అడుగులు వేయబోతున్నాట్లు సమాచారం. మొన్నటి వరకు ప్లేబ్యాక్ సింగర్ గా రానించిన మంగ్లీ ఇప్పుడు ఏకంగా ఒక సినిమాలో ఘోరమైన నెగటివ్ పాత్రలో కనిపించబోతోంది. అందుకు సంబంధించిన స్పెషల్ లుక్ కూడా వైరల్ గా మారింది. సింగర్ మంగ్లీ మొదట యాంకర్ గా కొనసాగిన విషయం తెలిసిందే అనంతరం కొన్ని వార్తలు చానల్స్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

  ఆ పాటలతో భారీ క్రేజ్

  ఆ పాటలతో భారీ క్రేజ్


  తీన్మార్ వార్తలు అంటే అప్పట్లో ఏ స్థాయిలో ఆకట్టుకునేవో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్ 2017 నుంచి ఆమె తన కెరీర్ ను కొనసాగిస్తోంది. మొదట శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో టైటిల్ పాడాను పాడి మంచి క్రేజ్ అందుకుంది. ఇక అల వైకుంఠపురంలో రాములో రాములో కుర్రకారును ఏ రేంజ్ లో ఉపేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పాట అనంతరం ఆమెకు ఒకేసారి పది సినిమాలలో పాడే ఆఫర్స్ వచ్చాయి.

  అందాదున్ రీమేక్ లో మంగ్లీ

  అందాదున్ రీమేక్ లో మంగ్లీ

  సింగర్ గా మంచి క్రేజ్ అందుకుంటున్న సమయంలోనే నటిగా కూడా నిరూపించుకునే అవకాశం దక్కింది. హీరో నితిన్ నటిస్తున్న అందాదున్ రీమేక్ లో మంగ్లీ ఒక నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. మాస్ట్రో టైటిల్ తో రాబోతున్న ఆ సినిమాలో నితిన్ కళ్ళు లేని వాడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. తమన్నా విలన్ పాత్రలో నటిస్తుండగా.. నాభా నటేష్ మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇక వీరితో పాటు మంగ్లీ కూడా కథను మలుపు తిప్పే సన్నివేశాల్లో అలరించబోతొంది. సమాచారం. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటను విడుదల చేయగా ఆ లిటికల్ పాటలో కూడా మంగ్లీ స్టిల్ ను రివీల్ చేశారు.

  హీరోను కిడ్నాప్ చేసే పాత్రలో

  హీరోను కిడ్నాప్ చేసే పాత్రలో


  హీరోను కిడ్నాప్ చేసే ఒక మహిళ పాత్రలో మంగ్లీ నటించినట్లు సమాచారం. స్టిల్స్ చూస్తుంటే సినిమాలో ఆ పాత్ర డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ అయితే జరుగుతున్నాయి. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నాడు. వెంకటాద్రి ఎక్స్ , ఎక్స్ ప్రెస్ రాజా వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చివరగా గాంధీ డైరెక్ట్ చేసిన నాని కృష్ణార్జున యుద్ధం సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనంతరం అతనికి మిగతా హీరోల నుంచి పెద్దగా ఆఫర్స్ ఏమీ రాలేదు.

  అతని మీద నమ్మకంతో

  అతని మీద నమ్మకంతో

  దర్శకుడు ప్రయత్నం చేసినప్పటికీ డిజాస్టర్ వలన హీరోలు ఎవరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. అయినప్పటికీ నితిన్ అతని మీద నమ్మకంతో అందాదున్ ను రీమేక్ చేసే అవకాశాన్ని ఇచ్చాడు. కథలో పెద్దగా మార్పులు చేయకుండా ఒరిజినల్ కథకు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ - జి ఫైవ్ వంటి బడా ఓటీటీ సంస్థలు సినిమా డైరెక్ట్ రిలీజ్ హక్కులకోసం బాగానే ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి డిస్ని హాట్ స్టార్ సంస్థకు అమ్మేసారు.

  కొంత లాభం వచ్చేలా

  కొంత లాభం వచ్చేలా

  సినిమా పై పెట్టిన పెట్టుబడి కంటే కొంత లాభం వచ్చేలా హాట్ స్టార్ ఇచ్చిన ప్యాకేజీకి నిర్మాతలు అయితే హ్యాపీగా ఫీల్ అయినట్లు సమాచారం. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట మూవీస్ పైనే ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాతో నితిన్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని అనుకొన్నాడు కానీ కరోనా వలన పరిస్థితులు అనుకూలించక పోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ కూడా లాభదాయకంగా లేవని డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

  Bigg Boss Telugu Season 5 Update: Payal Rajput In BiggBoss 5 Telugu ? | Filmibeat Telugu
   ఎలాగైనా సక్సెస్ కొట్టాలని నితిన్ ఆరాటం

  ఎలాగైనా సక్సెస్ కొట్టాలని నితిన్ ఆరాటం


  నితిన్ చివరగా భీష్మ సినిమాతో బాక్సాఫీసు వద్ద హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత చేసిన చెక్, రంగ్ దే సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడం వలన మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ముఖ్యంగా చెక్ సినిమా సినిమా ఏ స్థాయిలో నష్టాలను మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నితిన్ నెక్స్ట్ వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ సినిమా కథపై ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇద్దరు హీరోలు నటిస్తున్నట్లు కూడా టాక్ వచ్చింది. ఇక కొందరు ఈ కథను రిజెక్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. కానీ నితిన్ దర్శకుడిపై తో నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. దర్శకుడు వక్కంతం వంశీ గతంలో కిక్, రేసుగుర్రం, టెంపర్ వంటి కథలను అందించిన విషయం తెలిసిందే. ఇక ఆయన మొదట డైరెక్ట్ చేసిన 'నా పేరు సూర్య' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈసారి చేయబోయే సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

  English summary
  Telugu Singer mangli negative character in nithiin upcoming movie maestro and latest update,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X