twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆఖరి రెండు పాటలు.. ఆ సినిమా కోసం ప్రత్యేకంగా..

    |

    తెలుగు పాటకు ఒక అందమైన రూపం ఇవ్వడంలో అక్షరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుత రోజుల్లో రాస్తున్న పాటలు చేస్తున్న కంపోజింగ్ తో చాలా అర్థాలు మారిపోతున్నాయి. అయితే కేవలం కొంత మంది మాత్రమే తెలుగు పదాలకు సరైన న్యాయం చేస్తున్నారు. అక్షరం తప్పు పోకుండా దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. అలాంటి అతికొద్దిమంది పాటల రచయితలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. సిరివెన్నెల సీతారామశాస్త్రి హాస్పిటల్లో చేరక ముందు రెండు పాటలను రాశారు. ఒక యువ హీరో ఆయనతో ఆ రెండు పాటలను సిరివెన్నెలతో రాయిస్తేనే అందంగా ఉంటుంది అని సలహాలు కూడా ఇచ్చారట.

    ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా..

    ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునేలా..


    తోటి రచయితలు మంచి పాటలు రాసినప్పటికి కూడా ఆయన చాలా స్నేహంగా వారిని ప్రశంసిస్తారు. ఇక అలాంటి వ్యక్తి మరణం సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఎంతో మంది సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాటను రాశారు అంటే అది ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. కమర్షియల్ సినిమాల కన్నా కూడా మంచి కథాంశం ఉన్న సినిమాలకు ఆయన రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

    సినిమాకు సరైన అర్థం ఆయన రచనతోనే..

    సినిమాకు సరైన అర్థం ఆయన రచనతోనే..

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో ఒక్క పాట రాయించుకుంటే ఈ సినిమాకు సరైన అర్థం అని భావించే మంచి దర్శకులు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో క్రిష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఈ స్టార్ దర్శకులు ఎలాంటి సినిమా చేసినా కూడా ముందుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి వినిపించి ఆ తర్వాత సినిమాను మొదలుపెడతారు. వారితో ప్రత్యేకంగా కొన్ని పాటలు కూడా రాయించుకుంటారు.

    సిరివెన్నెల మీద గౌరవంతో

    సిరివెన్నెల మీద గౌరవంతో

    నేటితరం యువ దర్శకులు కూడా సిరివెన్నెల తో వర్క్ చేయాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. అంతే కాకుండా యువ హీరోలు కూడా సిరివెన్నెల మీద గౌరవంతో మంచి పాటలు రాయించుకోవాలి అని వెంట పడుతూ ఉంటారు. సిరివెన్నెల మరణించడంతో ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధ పడుతున్నారు. ఆయన మరణ వార్తను కూడా జీర్ణించుకోలేకపోతున్నామని ఈ వార్త అబద్ధం అయితే బాగుంటుంది అని సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతున్నారు.

     చివరగా నాని సినిమాలో

    చివరగా నాని సినిమాలో

    ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి ఐసీయూలో చేరే ముందు ఒక యువ హీరో సినిమాకు రెండు పాటలను అందించారు. ఆ సినిమా మరేదో కాదు. నాచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ ప్రాజెక్ట్. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రత్యేకంగా రెండు పాటలను రచించారు.

    Recommended Video

    Sirivennela Seetharama Sastry Garu మూగబోయిన సిరివెన్నెల || Filmibeat Telugu
    కథ విన్న తరువాత..

    కథ విన్న తరువాత..

    మొదట హీరో నాని సలహా మేరకు దర్శకుడు సిరివెన్నెల ను కలిసి కథను వివరించాడట. ఆ తర్వాత సిరివెన్నెల సినిమాకు తగ్గట్టుగా రెండు అద్భుతమైన పాటలను రచించారు. సిరివెన్నెల తో మొదలైన సీతారామశాస్త్రి కలం ప్రయాణం శ్యామ్ సింగరాయ్ తో ముగిసింది. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా పాటల రూపంలో మాత్రం సంగీతం బ్రతికి ఉన్నంత కాలం బ్రతికే ఉంటారు అని చెప్పవచ్చు.

    English summary
    Sirivennela Sitaramasastri last two songs written for nani ssr project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X