twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రత్యేక పాత్రలో శివ కార్తికేయన్.. ఆగస్ట్‌ 23న కౌసల్య కృష్ణమూర్తి

    |

    దక్షిణాదిలో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కష్ణమూర్తి ది క్రికెటర్‌'. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆగస్ట్‌ 14న హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, రచయిత హనుమాన్‌ చౌదరి పాల్గొన్నారు.

    దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ - ''ఆల్రెడీ టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే సాంగ్స్‌ మిలియన్స్‌ వ్యూస్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా మీద ఆడియన్స్‌కి పాజిటివ్‌ బజ్‌ ఉందని తెలుస్తోంది. మా ప్రొడ్యూసర్‌ గారు చెప్పినట్టు కౌసల్య కృష్ణమూర్తి డెఫినెట్‌గా ఒక మంచి సినిమా అవుతుంది. సినిమా అవుట్ ఫుట్‌ చాలా బాగుంది. మా కుటుంబ సభ్యులు కొంతమంది ఈ సినిమాను చూశారు. సినిమా టెక్నికల్‌గా కూడా చాలా బాగా వచ్చింది. రీమేక్‌ సినిమా అయినా ఒక స్ట్రెయిట్‌ సినిమా కన్నా ఎక్కువ ఎఫర్ట్‌ పెట్టి చేశాం. నిర్మాత రామారావుగారు చాలా మంచి ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ని ఇచ్చారు. ఇప్పటి తరానికి తగినట్లు తన ఆలోచనలను మార్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు ఆయన. మా టీమ్‌ అందరం మంచి డెడికేషన్‌తో సినిమా తెరకెక్కించాం. మీ అందరి సపోర్ట్‌ మాకు కావాలి. డెఫినెట్‌గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను'' అన్నారు.

    Siva Karthikeyan special role in Kausalya Krishnamurthy movie

    మాటల రచయిత హనుమాన్‌ చౌదరి మాట్లాడుతూ - ''నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావుగారికి థాంక్స్‌. దర్శకుడు భీమనేనిగారితో నేను 'సుడిగాడు' సినిమాకు వర్క్‌ చేయడం జరిగింది. నేను 'కె.జి.ఎఫ్‌' తరువాత మాటలు రాసిన సినిమా ఇది. ఒక అద్భుతమైన కథతో ఈ సినిమా రూపొందింది. డెఫినెట్‌గా ఈ సినిమా ఘనవిజయం సాధించి మా అందరికీ మంచి పేరు తెస్తుంది'' అన్నారు.

    నటీనటులు: ఐశ్వర్య రాజేష్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌ (స్పెషల్‌ రోల్‌), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, 'రంగస్థలం' మహేశ్‌, విష్ణు (టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు
    సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ,
    ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు,
    సంగీతం: దిబు నినన్‌,
    కథ: అరుణ్‌రాజ కామరాజ్‌,
    మాటలు: హనుమాన్‌ చౌదరి,
    పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణ కాంత్‌ (కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల,
    ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌,
    డాన్స్‌: శేఖర్‌, భాను,
    ఆర్ట్‌: ఎస్‌.శివయ్య, కో-డైరెక్టర్‌: బి.సుబ్బారావు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు,
    సమర్పణ: కె.ఎస్‌.రామారావు,
    నిర్మాత: కె.ఎ.వల్లభ,
    దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.

    English summary
    Siva Karthikeyan special role in Kausalya Krishnamurthy movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X