MAA బిల్డింగ్ కాదది, ఫ్లాట్.. అసలు సమస్య అదే... శివాజీ రాజా సంచలనం!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజు రోజుకీ చర్చనీయంశంగా మారుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల బరిలో దిగుతున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య మా బిల్డింగ్ అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే వారు నేరుగా ఈ విషయాలు ప్రస్తావించకున్నా వారికి మద్దతు పలుకుతున్న వారు దానిని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబు చేసిన కామెంట్స్ మీద నాగబాబు కౌంటర్ గా కామెంట్స్ చేయగా ఇప్పుడు శివాజీ రాజా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.. ఆ వివరాల్లోకి వెళితే

ఎందుకు కొన్నారు? ఎందుకు అమ్మారు?

ఎందుకు కొన్నారు? ఎందుకు అమ్మారు?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సొంత బిల్డింగ్ కొనుగోలు, అమ్మకం వ్యవహారంపై మోహన్ బాబు, నాగబాబుల పరస్పర కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. పాత బిల్డింగ్ అంశం తెరపైకి తెచ్చిన మోహన్ బాబుకు నాగబాబు, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2017లో అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా, సెక్రెటరీగా ఉన్న నరేష్ 90 లక్షల విలువ చేసే మా బిల్డింగ్ కేవలం 30 లక్షలకు విక్రయించారు అని, ఏమైనా అడగాలి అంటే నరేష్ నే అడగాలని నాగబాబు పేర్కొన్నారు.

డ్రైనేజీ ఇష్యూ

డ్రైనేజీ ఇష్యూ

ఆ సమయంలో మార్కెట్ వాల్యూ కంటే అతి తక్కువ ధరకు అమ్ముతున్నట్లు ఆడిటర్ తనతో చెప్పారని డ్రైనేజీ ఇష్యూ ఉండడంతో చివరకు అమ్మిన ధరలోనే రిజిస్ట్రేషన్స్ చార్జెస్ కూడా భరించి, తక్కువ ధరకు అమ్మారని ఆయన అన్నారు. ఇక ఈ అంశంలో నరేష్ ను స్పందించాల్సిందిగా కోరగా ఆయన లైన్ లోకి రాలేదు కానీ 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీరాజా స్పందించారు.

బిల్డింగ్ కాదది

బిల్డింగ్ కాదది

ఇక ఆ బిల్డింగ్ గా చెప్పబడుతున్న ఆస్తిని అమ్మింది తన హయాంలోనే అని పేర్కొన్న ఆయన అది బంగ్లానో, బిల్డింగో కాదని, ఒక పెంట్ హౌస్ లో ఉన్న డబుల్ బెడ్రూం ఫ్లాట్ అని, వెల్లడించారు. "అమ్మకానికి ఫ్లాట్" అంటూ ఎన్నో ప్రకటనలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో చివరికి 'మా' సంస్థకు సేవలు అందించిన శ్రీధర్ అనే వ్యక్తికీ కి ఆ ఫ్లాట్ అమ్మేశామని వివరించారు. అప్పుడు అంత ఖర్చు పెట్టలేమని చెప్పడంతో రిజిస్ట్రేషన్ కూడా తామే చేసామని వెల్లడించారు.

అందరూ అమ్మలన్నారు

అందరూ అమ్మలన్నారు

ఆ ఫ్లాట్ కొన్న శ్రీధర్ కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శివాజీ రాజా పేర్కొన్నారు, ఆ పెంట్ హౌస్ ఉన్న అపార్ట్ మెంట్ లో దర్శకుల సంఘం, రచయితల సంఘం కార్యాలయాలు కూడా ఉంటాయని, సినీ రంగానికి చెందిన కార్యాలయాలు ఉండడంతో తమ కార్యాలయం కూడా అక్కడే ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నాగబాబు నాడు ఆ పెంట్ హౌస్ ను కొనుగోలు చేసి ఉండొచ్చని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.

Recommended Video

Gem To Hit The Screens On September 17 | Gem Movie Team Pressmeet
నన్ను అడగొచ్చు

నన్ను అడగొచ్చు

అంతే కాక నాగబాబు హయాంలో ఎంత నిజాయతీతో ఆ ఫ్లాట్ కొన్నారో, నేను అధ్యక్షుడిగా, నరేశ్ కార్యదర్శిగా ఉన్న సమయంలో అంతే నిజాయతీగా అమ్మేశాం" అని చెప్పుకొచ్చారు. ఆ ఫ్లాట్ కు సింగిల్ గోడ, కింద డ్రైనేజీ ఇష్యూ ఉండడంతో దానిని అమ్మాలని పలువురు పెద్దలు కూడా సూచించారని ఈ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే తనను అడగొచ్చు అని పేర్కొన్నారు. మొత్తానికి ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X