twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sivakarthikeyan యుద్దంతో నవ్వులు పండించడం అతడికే తెలుసు.. హరీష్ శంకర్ ఎమోషనల్ స్పీచ్

    |

    ప్రముఖ నిర్మాత, స్వర్గీయ నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ప్రిన్స్ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ..

    Harish Shankar

    ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ గారు, రామ్మోహన్ రావు, సురేష్ గారు నాకు చాలా కావాల్సిన వారు. వారు పిలువగానే ప్రిన్స్ సినిమా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చే వరకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని తెలియదు. బావా నీవు ఎన్ని సినిమాలకు మ్యూజిక్ చేస్తున్నావు.. ఎంత బిజీగా మారిపోయావు నాకు ఈ సినిమాలో రెండు ఫేవరేట్ సాంగ్స్ ఉన్నాయి అని హరీష్ శంకర్ అన్నారు.

    దర్శకుడు అనుదీప్ ఏం చదువుకొన్నాడని సుమ అడిగింది. అయితే అనుదీప్‌ను చూసిన తర్వాత ఆయన మిడిల్ క్లాస్ లైఫ్‌ను క్షుణ్ణంగా చదివాడని అనిపిస్తుంది. రమణ, గొల్లపూడి, జంధ్యాల గారు. బాపుగారు మిడిల్ క్లాస్ లైఫ్‌ను బాగా చదివారు కాబట్టి వారు మంచి సినిమాలు చేశారు. కామెడీ సీరియస్‌గా చేయాలి. లేకపోతే వెకిలి అయిపోతుంది అని హరీష్ శంకర్ అన్నాడు.

    శివకార్తీకేయన్ గురించి హరీష్ శంకర్ మాట్లాడుతూ.. మీ కామెడీ టైమింగ్, యాక్టింగ్, మీ బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. డాక్టర్, డాన్, రెమో సినిమాలను థియేటర్లో చూశాను. మీ యాటిట్యూడ్ బాగుంటుంది. ఇంత వరకే తమిళంలో ప్రిపేర్ అయ్యాను. ఇంతకంటే తమిళంలో మాట్లాడలేను. వెలకమ్ టూ టాలీవుడ్. ఈ రోజుల్లో తమిళం, తెలుగు, కన్నడ అనే భాషా బేధం లేదు. ఇకటే సినిమా మాట్లాడుతుంది అని హరీష్ శంకర్ అన్నాడు.

    ఇక అనుదీప్ గురించి చెప్పాలి. ప్రపంచమంతా యుద్దం చేస్తున్న సమయంలో జాతిరత్నాలతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు యుద్దం జరుగుతున్న దేశం నుంచి అమ్మాయిని తెచ్చి సినిమా చేశాడు. యుద్ధంలో కూడా సినిమా ద్వారా నవ్వులు పండివచ్చని అనుదీప్ నిరూపించాడు అని ప్రశంసల్లో ముంచెత్తారు.

    సునీల్ నారంగ్ తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయ్యారు. నారాయణ దాస్ గారు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాను. అప్పుడు ప్రిన్స్ సినిమా గురించి నాకు చెప్పాడు. చాలా మంచి సినిమా అవుతుందని అన్నాడు. ఆయన పేరు, ఫోటో ఈ బ్యానర్‌పై చూడటం చాలా హ్యాపీగా ఉందని హరీష్ అన్నాడు.

    English summary
    Harish Shankar emotional about Anudeep, Thaman S and Narayana Das Narang at Sivakarthikeyan's Prince Pre Release Event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X